Dancing Trees of Sumba Island: చెట్లు చిరు గాలి వీస్తే వయ్యారంగా ఊగుతాయి. అదే బలంగా గాలి వీస్తే.. చెట్లు ఓ రేంజ్ లో ఊగిపోతూ.. చెట్లు నేలకు ఒరిగిపోతాయన్నట్లు భయం గొల్పిస్తాయి. అయితే సంతోషంగా గంతులు వేసే చెట్ల గురించి తెలుసా.. సంతోషం వస్తే మనిషి గంతులేసి డ్యాన్స్ చేసినట్లు.. ఒక ద్వీపంలో చెట్లు కూడా తమకు సంతోషం వస్తే ఓ రేంజ్ లో డ్యాన్స్ చేస్తాయట. ఆ చెట్లు చేసే డ్యాన్స్ విన్యాసాలు.. చూడడానికి సాల్సా డ్యాన్స్ లా అనిపిస్తుంది. ఈ డ్యాన్సింగ్ ట్రీస్ ఎక్కడ ఉన్నాయో తెలుసా..
ఇండోనేషియాలోని సుంబా ద్వీపంలో ప్రముఖ పర్యాటక ప్రదేశాలలో ఒకటి వాలకిరి బీచ్. ఈ బీచ్ లో తెల్లని ఇసుక, “డాన్సింగ్ ట్రీస్” పర్యాటకులకు కనువిందు చేస్తాయి. ప్రశాంతమైన సముద్ర తీరంలో ఇసుక తిన్నెల మీద వయ్యారంగా సాల్సా డ్యాన్స్ చేస్తుంటే చూపరులు కనులు తిప్పుకోలేరట. సముద్ర తీరంలో ఉండే ఈ చెట్లు అలల తాకిడికి ఒక చోట నుంచి మరొక చోటకు ప్రయాణం చేస్తాయి. పొట్టిగా రెండు మూడు కొమ్మలతో చిన్న చిన్న ఆకులతో మనిషి రూపంలో దర్శనమిచ్చే ఈ చెట్లను తదేకంగా చూస్తే డ్యాన్స్ చేస్తున్నాయన్నట్లు భ్రమ కలుగుతుందట. చెట్లు డ్యాన్స్ చేస్తున్నట్లు ఉండే దృశ్యం సూర్యోదయం సమయంలో, సూర్యాస్తమయం సమయంలో చూడాలని పర్యాటకులు చెబుతున్నారు. సుంబా ద్వీపానికి ఈ మొక్కలకి చేసే సాల్సా డ్యాన్స్ చూడడనికి పర్యాకులు ప్రకృతి ప్రేమికులు క్యూ కడతారట.
Also Read: రూ. 15 కోట్ల విలువైన ఆస్థిని తన పెంపుడు కుక్క ఫ్రాన్సిస్కో కు రాసిన మోడల్.. ఎక్కడంటే ..