Meat Eaters Wanted: మీరు మాంసాహార ప్రియులా.. 3 నెలలు శాఖాహారులుగా మారితే.. 50లక్షల బహుమతి.. ఎక్కడో తెలుసా..!

|

Feb 02, 2021 | 10:35 AM

మీరు మాంసాహార ప్రియులా ముక్క లేనిదే ముద్ద దిగదా.. అయితే మీకో బంపర్ ఆఫర్.. కాకపోతే మీ అలవాట్లను కొంచెం త్యాగం చెయ్యాలి అంతే.. ఓ కంపెనీ పెట్టిన షరతును ఒప్పుకుని మూడు నెలలు మీవి..

Meat Eaters Wanted: మీరు మాంసాహార ప్రియులా.. 3 నెలలు శాఖాహారులుగా మారితే.. 50లక్షల బహుమతి.. ఎక్కడో తెలుసా..!
Follow us on

Meat Eaters Wanted: మీరు మాంసాహార ప్రియులా ముక్క లేనిదే ముద్ద దిగదా.. అయితే మీకో బంపర్ ఆఫర్.. కాకపోతే మీ అలవాట్లను కొంచెం త్యాగం చెయ్యాలి అంతే.. ఓ కంపెనీ పెట్టిన షరతును ఒప్పుకుని మూడు నెలలు మీవి కాదనుకుని నాన్ వెజ్ తినకుండా ఉంటె ఏకంగా భారత్ కరెన్సీలో రూ. 50 లక్షలు గెలుపొందవచ్చు. వివరాల్లోకి వెళ్తే…

బ్రిటన్ లోని వైబ్రెంట్ వీగన్ అనే కంపెనీ.. ‘వీగన్ క్యూరియస్ కోఆర్డినేటర్’గా పని చేసేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
ఇందులో ఎంపికైతే మూడు నెలల వరకూ శాఖహార ఉత్పత్తుల్ని మూడు నెలల వరకూ కంపెనీ ఇవ్వడంతోపాటు..ఓ న్యూట్రిషియన్ ను కూడా పంపించి పర్యవేక్షిస్తుంది. అయితే పూర్తి మాంసాహారులై వారినే ఈ కంపెనీ ఎంపిక చేస్తుంది. వారు ఈ ఉద్యోగానికి ఎంపికయ్యాక మూడు నెలలపాటు మాంసాహారం తినకూడదు. సోషల్ మీడియాలో శాఖాహారం గురించి ప్రచారం చేయాలి.
మూడు నెలల తర్వాత కూడా మేము నాన్ వెజ్ తినం అన్నవారికి కోటి రూపాయాల విలువైన శాకాహార ఉత్పత్తులను ఇస్తామని కంపెనీ యాజమాన్యం ప్రకటించింది. ప్రస్తుతం ఈ ఉద్యోగ ఆఫర్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.

Also Read: వైద్య సిబ్బంది నిర్లక్ష్యం.. పోలియో చుక్కలకు బదులు… శానిటైజర్.. 12మంది చిన్నారులకు అస్వస్థత