నిజమైన ప్రేమ ఆనందాన్ని మాత్రమేకాదు బాధనూ పంచుకుంటుంది. ఒకరినొకరు అర్థం చేసుకుని, ఎటువంటి పరిస్థితులనైనా తట్టుకుని ముందుకు వెళ్లేదే అసలు సిసలైన బంధమంటే. నూరేళ్ల తమ ప్రయాణంలో అనుకోకుండా భాగస్వామికి అంతుచిక్కని వ్యాధి సంభవిస్తే, చేయూతనిచ్చి ధైర్యం చెబితే బాధ కూడా దూరంగా పారిపోతుంది. అలాంటి జంటకు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం నెటిజన్లను కంటతడి పెట్టిస్తోంది. మీరూ చూడండి..
ఈ వీడియోలో ఓ వ్యక్తి తన గర్ల్ ఫ్రెండ్ తల షేవింగ్ చేస్తుంటాడు. ఓపికగా అద్దం ముందు కూర్చుని ఆమె తల మొత్తం శుభ్రంగా షేవ్ చేయించుకుంటుంది. అనంతరం అతను కూడా తన తలను షేవ్ చేసుకోవడం వీడియోలో కనిపిస్తుంది. అది చూసి ఆమె రెండు చేతులతో ముఖం కప్పుకుని కుమిలి కుమిలి ఏడ్వడం వీడియోలో చూడొచ్చు. ఇంతకీ అసలేం జరిగిందంటే.. ఎవా బరిలారో అనే యువతి అలోపేసియా బాధపడుతోంది. ఈ వ్యాధితో వల్ల ఆమె జుట్టు విపరీతంగా ఊడిపోతుంటుంది. దీంతో ఆమె మరింత బాధపడిపోతుండటంతో తనకు పూర్తిగా గుండు చేయమని బాయ్ ఫ్రెండ్ డామియన్‌ను కోరుతుంది. దీంతో అతను బరిలారో కోరిక మేరకు ఆమె జుట్టు మొత్తం షేవ్ చేస్తాడు. అనంతరం తాను కూడా గుండు చేసుకోవడం చూసి ఆశ్చర్యంతో ఆమె బావోధ్వేగానికి గురవుతుంది.. ఈ వీడియోకు ఇప్పటికే 5 మిలియన్ల వీక్షణలు, లక్షల్లో లైకులు, కామెంట్లు రావడంతో పాత వీడియో అయినప్పటికీ ప్రస్తుతం నెట్టింట మళ్లీ వైరల్ అవుతోంది. భాగస్వామి బాధను పంచుకోవడానికి, ఆమెకు ధైర్యం చెప్పడానికి సపోర్టుగా నిలిచావంటూ నెటిజన్లు డామియన్ తెగ పొగిడేస్తున్నారు. నేను కూడా నా పార్ట్‌నర్ కోసం ఇలాగూ చేవానంటూ మరికొందరు తమ అనుభవాలను పంచుకున్నారు.
I would do the same for my wife ❤️
— Tdiggity?? (@Tdiggity88) April 11, 2023
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.