జపాన్‌లో బాగా పాపులర్ అయిన ఒక టీవీ షో గురించి మీకు చెప్పబోతున్నాం. సదరు షో గత 15 సంవత్సరాలుగా దిగ్విజయంగా నడుస్తోంది. ఆరు నిమిషాల నిడివి గల కంటెంట్‌ను ప్రతి ఎపిసోడ్లో ప్రదర్శిస్తారు. ఇంతకీ ఆ షోలో కంటెంట్ ఏముందో తెలిస్తే మీరు షాకవుతారు. ప్రతి ఎపిసోడ్లో ఒక యువతి కేవలం మెరకగా ఉన్న రోడ్డుపై పరిగెత్తుతూ ఉంటుంది. నటి, గాయని లేదా టీవీ ప్రెజంటర్లు అయిన మహిళలను ఈ షో కోసం తీసుకుంటారు. ఒక్కో ఎపిసోడ్లో ఒక్కో మహిళను క్యాస్ట్ చేస్తారు. ‘జెన్రియోకు జాకా’ అనే పేరుగల ఈ షో అసహి టీవీలో ప్రసారం అవుతుంది. జపాన్‌లో ఎక్కువ కాలం నడుస్తున్న టీవీ షోలలో ఇది ఒకటి. జపాన్‌లో రాత్రి 1:20 గంటలకు ఇది ప్రసారం అవుతుంది. గత పదిహేనేళ్లుగా, ఈ షోను చూడటానికి ప్రజలు అర్థరాత్రి వరకు మేల్కొనే ఉంటున్నారు. ఎపిసోడ్లో ఫోకస్ అంతా ఒక అమ్మాయిపై మాత్రమే ఉంటుంది. ఎపిసోడ్ ప్రారంభం నుండి ముగింపు వరకు సదరు యువతి పరిగెత్తడమే షో కంటెంట్. ఈ షోలో ఏ యువతినీ ఒకటి కంటే ఎక్కువసార్లు రిపీట్ చెయ్యరు. షో లొకేషన్ కూడా మార్చరు. టోక్యోలోని కొన్ని రోడ్లపై ఎపిసోడ్లను చిత్రీకరిస్తారు. షో యొక్క 3000 ఎపిసోడ్లను నిర్మాణ సంస్థ యూట్యూబ్‌లో అప్లోడ్ చేసింది. త్వరలో ఈ షో మేల్ వెర్షన్ కూడా ప్రారంభించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే యువతులపై ఫోకస్ అలాగే ఉంటుందని జెన్రియోకు జాకా మేకర్స్ అంటున్నారు.