Israeli Airstrikes: బాంబుల మోతతో దద్దరిల్లిన గాజా.. వైమానిక దాడులకు దిగిన ఇజ్రాయిల్‌.. 30 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు

ఇజ్రాయిల్‌– పాలస్తీనా మధ్య మరోసారి బాంబుల మోతతో దద్దరిల్లింది. వైమానిక దాడుల్లో సామాన్య పౌరులు బలయ్యారు. ఇజ్రాయిల్‌– పాలస్తీనాల మధ్య ఘర్షణ తారాస్థాయికి చేరింది.

Israeli Airstrikes: బాంబుల మోతతో దద్దరిల్లిన గాజా.. వైమానిక దాడులకు దిగిన ఇజ్రాయిల్‌.. 30 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
Israeli Airstrikes
Follow us

|

Updated on: May 12, 2021 | 10:55 AM

Israeli airstrikes: ఇజ్రాయిల్‌– పాలస్తీనా మధ్య మరోసారి బాంబుల మోతతో దద్దరిల్లింది. వైమానిక దాడుల్లో సామాన్య పౌరులు బలయ్యారు. ఇజ్రాయిల్‌– పాలస్తీనాల మధ్య ఘర్షణ తారాస్థాయికి చేరింది. జెరూసలేంలో కొద్దివారాలుగా నెలకొన్న ఉద్రిక్తతలు.. యుద్ధ వాతావరణాన్ని తలపించాయి. సోమవారం సూర్యాస్తమయం నుంచి గాజాలోని హమాస్‌ ఉగ్రవాదులు ఇజ్రాయెల్‌పైకి వందలకొద్ది రాకెట్‌ బాంబులతో దాడికి తెగబడింది. ఈ దాడుల్లో ఇద్దరు ఇజ్రాయిల్‌వాసులు మృతి చెందారు. మరో పదుల సంఖ్యలో గాయపడ్డారు. దీంతో ప్రతీకారం తీర్చాలనుకున్న ఇజ్రాయిల్‌ వైమానిక దాడులకు దిగింది. సోమవారం రాత్రి నుంచి మంగళవారం రోజంతా ఎడతెగకుండా గాజాపై బాంబుల వర్షం కురిపించింది.

ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో గాజాలోని ఒక మల్టీస్టోరీ అపార్డ్‌మెంట్ భవనం పూర్తిగా నేలమట్టం అయ్యింది. గాజా స్ట్రిప్ నుండి కాల్చిన రాకెట్లు అత్యంత దూరప్రాంతాలకు చేరుకున్నాయి.ఉగ్రవాదులు లక్ష్యంగా సాగిన ఈ దాడుల్లో 10 మంది చిన్నారులు, ముగ్గురు ఇజ్రాయెల్ పౌరులతో సహా కనీసం 30 మంది పాలస్తీనియన్లు మరణించారు. అయితే, వీరిలో 16 మందిని ఉగ్రవాదులేనని ఇజ్రాయిల్‌ సైన్యం ప్రకటించింది. హమాస్‌ దాడులపై ఇజ్రాయిల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు తీవ్రంగా స్పందించారు. ఊహించని స్థాయిలో హమాస్‌పై దాడులుంటాయని హెచ్చరించారు. 5,000 మంది రిజర్వ్‌ సైనికులను గాజా సరిహద్దుకు తరలించాల్సిందిగా రక్షణ మంత్రి ఆదేశాలిచ్చారు.

జెరూసలేంలోని అల్‌ అక్సా మసీదు వద్ద సోమవారం ఇజ్రాయిల్‌ సైనికుల, పాలస్తీనియన్లకు మధ్య జరిగిన గొడవలు చెలరేగిన విషయం తెలిసిందే. ఇవి కాస్తా ముదిరి పరస్పర దాడులకు దారితీశాయి. పాలస్తీనాపై ఇజ్రాయిల్‌ దాడులను ముస్లిం దేశాలు మంగళవారం తీవ్రంగా ఖండించాయి. ఇజ్రాయెల్‌ చర్యను పాశవికమని పేర్కొన్నాయి.

Read Also…  CIVIL AVIATION: మళ్ళీ కుదేలవుతున్న విమానయాన రంగం.. సెకెండ్ వేవ్ దెబ్బకు ఢమాల్

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు