CIVIL AVIATION: మళ్ళీ కుదేలవుతున్న విమానయాన రంగం.. సెకెండ్ వేవ్ దెబ్బకు ఢమాల్

గత సంవత్సరం కరోనా వైరస్ ప్రభావంతో మూడు, నాలుగు నెలలపాటు లాక్‌డౌన్ కొనసాగడంతో దేశంలో విమానయానరంగం కుదేలైపోయింది. అయితే 2020 నవంబర్ తర్వాత లాక్‌డౌన్ ఎత్తివేయడం... కరోనా భయం తొలిగిపోవడం..

CIVIL AVIATION: మళ్ళీ కుదేలవుతున్న విమానయాన రంగం.. సెకెండ్ వేవ్ దెబ్బకు ఢమాల్
Flights On Corona
Follow us

|

Updated on: May 12, 2021 | 10:13 AM

CIVIL AVIATION INDUSTRY COLLAPSED: గత సంవత్సరం కరోనా వైరస్ (CORONA VIRUS) ప్రభావంతో మూడు, నాలుగు నెలలపాటు లాక్‌డౌన్ కొనసాగడంతో దేశంలో విమానయానరంగం (CIVIL AVIATION INDUSTRY) కుదేలైపోయింది. అయితే 2020 నవంబర్ తర్వాత లాక్‌డౌన్ (LOCK DOWN) ఎత్తివేయడం… కరోనా (CORONA) భయం తొలిగిపోవడం.. దేశీయంగా పర్యాటకులు పెరగడంతో విమానయానరంగం మళ్ళీ పుంజుకోవడం ప్రారంభమైంది. అదే సమయంలో దేశీయంగా అవసరాలు పెరిగిపోవడం, కార్గో సేవలు (CARGO SERVICES) కూడా పుంజుకోవడంతో ఏవియేషన్ రంగం (AVIATION FIELD) పుంజుకుంటున్న పరిణామాలు కనిపించాయి. అదే ధోరణి 2021 జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలల్లో దేశీయంగా విమాన ప్రయాణాల్లో పెరుగుదల కనిపించింది. ఆ తర్వాతే పరిణామాలు తిరోగమనంలో పడిపోయాయి. ఏప్రిల్ మొదటి వారం నుంచి దేశీయంగా విమాన ప్రయాణీకుల సంఖ్య క్రమంగా తగ్గుతూ వచ్చింది. మే రెండో వారం నాటికి విమాన ప్రయాణీకుల సంఖ్య గణనీయంగా పడిపోయింది.

కరోనా నుంచి తిరిగి పుంజుకోగలమని గతేడాది నవంబరులో చాలా వరకు విమానయాన కంపెనీలు (AVIATION COMPANIES) నిబ్బరంగా చెప్పాయి. అయితే మలివిడత ఉద్ధృతితో ఇపుడు బెంబేలు పడుతున్నాయి. పలు అంతర్జాతీయ మార్గాలు రద్దు కావడంతో ఇబ్బందుల్లో మునిగాయి. నిధుల కోసం ప్రభుత్వం (GOVERNMENT), బ్యాంకుల (BANKS)వైపు చూడడం మొదలైంది. అయితే ఆదుకునే ఆర్థిక సంస్థలు (FINANCIAL ORGANISATIONS) అంతగా కనిపించడం లేదు. ఆర్థిక సాయం చేసే స్థితిలో ప్రభుత్వమూ లేదు. ఈ క్రమంలో విమానయానరంగం మరోసారి నష్టాల బాటలో పయనిస్తోంది. విమానయాన సంస్థలు మళ్లీ ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతున్నాయి. కొత్త కరోనా వేరియంట్లు (CORONA NEW VARIANTS) విసురుతున్న సవాళ్లు, చాలా ప్రాంతాల్లో వ్యాక్సిన్ పంపిణీ (VACCINE DISTRIBUTION) స్లోగా జరుగుతుండడం వల్ల ఈ సంవత్సరం కూడా ఇంకా నష్టాలు తప్పవని అంతర్జాతీయ విమాన రవాణ సంఘం (AITA)) కూడా అభిప్రాయపడుతోంది. అంత క్రితం వేసిన అంచనాల కంటే 25% ఎక్కువగా అంతర్జాతీయ కంపెనీలకు 47.7 బిలియన్ డాలర్ల నష్టాలు తప్పవని అంటోంది.

గత ఆర్థిక సంసవత్సరం కరోనా కారణంగా రెండో క్వార్టర్‌లో ఆదాయాల్లో నిర్వహణ నష్టాలు 70 శాతం దాటినట్లు అంఛనాలున్నాయి. వ్యయ నియంత్రణ చర్యలు, బలమైన కార్గో వ్యాపారం వల్ల 2020 ద్వితీయార్ధంలో నష్టాలు కొంత మేరకు తగ్గాయి. అయితే కొన్ని స్థిర వ్యయాల కారణంగా 2020 చివరి త్రైమాసికానికి నష్టాలు 50 శాతానికే పరిమితం అయ్యాయి. తిరిగి కోలుకుంటామని నవంబరులో చాలా వరకు విమాన కంపెనీలు ధీమా కనబరిచాయి. అంతలోనే పరిస్థితి తారుమారైంది. ఫిబ్రవరి 2021 నుంచి కరోనా సెకెండ్ వేవ్ (CORONA SECOND WAVE) ఎదురైంది. చాలా వరకు దేశాలు భారత్‌కు, భారత్‌ నుంచి విమానాల విషయంలో ఆంక్షలు విధించాయి. ఈ ఆంక్షలు ఎప్పటికి తొలగుతాయో కూడా తెలియని అయోమయ పరిస్థితి ప్రస్తుతం నెలకొంది. కరోనాకు తోడు విమాన ఇంధన ధరలు కూడా పెరగడంతో ఏవియేషన్ సంస్థలు మరింత ఇబ్బందుల్లో పడిపోయాయి. తొలి విడత కరోనా కాలంలో విమానాలు లీజుకిచ్చిన సంస్థలు దేశీయ విమానయాన సంస్థలపై కొంత దయ చూపారు. వాయిదాలు ఆలస్యమైనా ఓపిక పట్టారు. అయితే ఈ సారి అలా జరగకపోవచ్చని ఆర్థిక వేత్తలు అభిప్రాయపడుతున్నారు. అందుకే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రథమార్ధంలో 250-300 విమానాలు ఎగరకపోవచ్చని విశ్లేషకులు అంటున్నారు. లీజుకిచ్చిన వారంతా ఇపుడు కలిసికట్టుగా ఉన్నారనీ.. వారు విమానయాన సంస్థల రుణాలను రైటాఫ్‌ చేసే అవకాశమే లేదని విశ్లేషిస్తున్నారు.

దేశీయ విమానయాన సంస్థల విషయానికొస్తే గతంలో 80 శాతంగా ఉన్న ప్యాసింజర్ల రద్దీ 2021 ఏప్రిల్‌లో 30 శాతానికి పడిపోయింది. మే నెలలో అది సగానికి పడిపోయినా ఆశ్చర్యం లేదని ఆర్థిక వేత్తలు అభిప్రాయపడుతున్నారు. దీంతో దినసరి వ్యయాలను భరించడం విమానయాన కంపెనీలకు భారంగా మారింది. ఈ నేపథ్యంలోనే ఇండిగో (INDIGO) రూ.3,000 కోట్ల నిధుల సమీకరణలో పడింది. విచిత్రం ఏమిటంటే రికవరీ బాగుందన్న ఆలోచనతో గత జనవరిలోనే ఈ ప్రణాళికను పక్కనపెట్టింది. మార్కెట్లో 50% వాటా ఉన్న ఈ కంపెనీకే నిధుల అవసరం తప్పలేదు. అయితే క్రమంగా అయినా ఇండిగో గట్టెక్కుతుందని మార్కెట్‌ వర్గాలు అంచనాకడుతున్నారు. ప్రభుత్వం, బ్యాంకులు మద్దతిస్తేనే చిన్న సంస్థలు గట్టెక్కే పరిస్థితి ఉంటుందని చెబుతున్నారు. గత ఆర్థిక సంవత్సరంలో భారత కంపెనీలకు 4-4.5 బిలియన్‌ డాలర్ల (దాదాపు రూ.30,000-33,700 కోట్లు) నష్టం వాటిల్లిందని ఓ విమానయాన కన్సల్టెన్సీ నివేదిక చెబుతోంది. ఈ ఏడాది మరిన్ని నష్టాలు రావొచ్చని అంటోంది. గతేడాది స్థాయిలో డీలా పడినా… రెండేళ్లలో రూ.60 వేల కోట్లకు పైగా నష్టం వాటిల్లిందన్నమాట.

రికవరీ సాధ్యమేనా?

ఆర్థిక వ్యవస్థ, ఉద్యోగాలు, ఆదాయాలు కుదుటపడితే దేశీయ ప్రయాణాల్లో రికవరీని 2021 సంవత్సరాంతానికి గానీ చూడలేమని ఆర్థిక విశ్లేషకులు, విమానయాన రంగం నిఫుణులు అంటున్నారు. 2022 తొలి త్రైమాసికానికి పరిస్థితులు కాస్త గాడిలో పడినా.. ముందుగానే జరిగినట్లు భావించాలని చెబుతున్నారు. అంతర్జాతీయ రద్దీ తిరిగి కరోనాకు ముందు స్థాయులకు చేరాలంటే 2024లోనే చూడగలమని నిపుణులు పేర్కొంటున్నారు. ఈక్రమంలో దేశీయ విమానయాన సంస్థల ఆర్థిక స్థితిగతులు మరో మూడేళ్ళ దాకా ఇలాగే నష్టాల బాటలోనే వుంటుందని అంఛనా వేస్తున్నారు. ఇదే జరిగితే ఎన్ని సంస్థలు వుంటాయి.. ఎన్ని సంస్థలు తమ కార్యకలాపాలను మూసి వేయడమో.. ఇతర దేశాలకు తరలించడమో చేస్తాయో వేచి చూడాల్సిన అంశంగా కనిపిస్తోంది.

ALSO READ: భవిష్యత్ కార్యాచరణపై ఈటల కీలక వ్యూహం.. ముందుకు కేసీఆర్ స్పందన రానీయ్ అంటున్న బీసీ నేత

దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?