Hijab Protest in Iran: మహిళల నిరసనలతో దిగివచ్చిన ఇరాన్ ప్రభుత్వం.. వారి తరఫున అటార్నీ జనరల్ ఏమన్నారంటే..?

హిజాబ్ ధరించే కఠినమైన అభ్యాసానికి వ్యతిరేకంగా ఇరాన్ దేశవ్యాప్తంగా ఆ దేశ మహిళలు చేపట్టిన నిరసనలు విజయవంతమయ్యాయి. ఎందుకంటే ప్రజల ఆగ్రహానికి గురవుతున్న ఇరాన్ ప్రభుత్వం కఠినమైన

Hijab Protest in Iran: మహిళల నిరసనలతో దిగివచ్చిన ఇరాన్  ప్రభుత్వం.. వారి తరఫున అటార్నీ జనరల్ ఏమన్నారంటే..?
Hijab Protest In Iran

Updated on: Dec 04, 2022 | 10:54 AM

హిజాబ్ ధరించే కఠినమైన అభ్యాసానికి వ్యతిరేకంగా ఇరాన్ దేశవ్యాప్తంగా ఆ దేశ మహిళలు చేపట్టిన నిరసనలు విజయవంతమయ్యాయి. ఎందుకంటే ప్రజల ఆగ్రహానికి గురవుతున్న ఇరాన్ ప్రభుత్వం కఠినమైన హిజాబ్ చట్టాన్ని పరిగణనలోకి తీసుకోవాలని తాజాగా నిర్ణయించింది. సెప్టెంబర్ 13-14 తేదీలలో ఇరాన్‌లో 22 ఏళ్ల మహసా అమిని పోలీసు కస్టడీలో మరణించిన విషయం మనందరకీ తెలిసిన విషయమే. ఇరాన్‌లో మహిళలకు తప్పనిసరి నిబంధన అయిన హిజాబ్‌ను అమినీ సరిగా తలపై కప్పుకోనందున పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. మహసా అమినీ మరణం ఇరాన్‌లో అనేక నిరసనలకు కారణం అయింది. వందలాది మంది మహిళలు, పురుషులు వీధుల్లోకి వచ్చి ఈ చట్టాన్ని దేశం నుంచి తొలగించాలని డిమాండ్ చేయడం ప్రారంభించారు. ఇప్పుడు ఈ ప్రదర్శనలు ఇరాన్ ప్రభుత్వాన్ని తీవ్రంగా ప్రభావితం చేశాయని చెప్పడం అతిశయోక్తి కానే కాదు.

ఇరాన్ పార్లమెంట్, న్యాయవ్యవస్థ ఇప్పుడు దేశంలోని హిజాబ్ చట్టాన్ని సమీక్షిస్తున్నాయి. ఈ విషయాన్ని ఆ దేశ అటార్నీ జనరల్ మహ్మద్ జాఫర్ మోంటాజేరి స్వయంగా తెలిపారు. అయితే ఈ దిశ‌గా ఎలాంటి మార్పు వ‌స్తుందో మాత్రం చెప్ప‌లేదు. సమీక్షా బృందం బుధవారం పార్లమెంటు సాంస్కృతిక కమిషన్‌తో సమావేశమైందని, ఒకటి లేదా రెండు వారాల్లో నిర్ణయం వెలువడుతుందని అటార్నీ జనరల్ చెప్పారు. నిజానికి 1979 విప్లవం తర్వాత నాలుగు సంవత్సరాల తరువాత, అంటే 1983 (ఏప్రిల్)లో, ఇరాన్‌లోని మహిళలందరికీ హిజాబ్ అంటే తలకు కండువా ధరించడం తప్పనిసరి చేశారు అప్పటి పాలకులు. సెప్టెంబరులో మహ్సా అమిని మరణం తరువాత, ఈ హిజాబ్ అభ్యాసానికి వ్యతిరేకంగా తిరుగుబాటు జరిగింది. ప్రజలు వీధుల్లోకి వచ్చారు. నిరసన తెలుపుతున్న మహిళలు తలలను కప్పుకోవడానికి స్వస్తి పలికారు. చట్టానికి వ్యతిరేకంగా చాలా మంది మహిళలు తమ జుట్టును కత్తిరించుకున్నారు ఇంకా హిజాబ్‌లను కాల్చారు.

చట్టాన్ని పాటించని ఇరాన్ మహిళలు

మహసా అమినీ మృతిపై హిజాబ్ నిరసనకారుల్లో ఆగ్రహం ఎంతగా ఉందంటే వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిలబడ్డారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ముస్లిం మతపెద్దల తలల నుంచి తలపాగాలను కూడా  తీసేసి విసిరారు. నిరసనలు ప్రారంభమైనప్పటి నుంచి, ఇరాన్ మహిళలు హిజాబ్ చట్టాన్ని ఉల్లంఘిస్తున్నారు. సెప్టెంబర్ 16 నుంచి ఇరాన్‌లో మొదలైన ఈ ఉద్యమం ఇప్పటి వరకూ జరిగిన ఉద్యమాలల్లోకెల్లా చాలా పెద్దది. ఇంకా దీని వల్ల ఆ దేశ ప్రభుత్వం భయపడుతోంది. ఇరాన్ రిపబ్లికన్ అండ్ ఇస్లామిక్ పునాదులు రాజ్యాంగబద్ధంగా స్థాపితమైనవని అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ శనివారం అన్నారు. అయితే రాజ్యాంగాన్ని అమలు చేయడానికి కొన్ని పద్ధతులు సరళమైనవని, ఇరాన్ సంప్రదాయవాద దేశమని గుర్తించాలి మనం. చట్టంలో సవరణ కూడా ఎక్కడో ఉన్న సంప్రదాయవాదులపై ఆధారపడి ఉంటుంది. సంప్రదాయవాదులు మహిళలు తమ తలలను కప్పుకోవడం తప్పనిసరి అని నమ్ముతారు. అయితే ఈ సంప్రదాయవాద ఆలోచన నుంచి ఇరాన్ బయటకు రావాలని సంస్కరణవాదులు అంటున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని మరిన్ని ట్రెండింగ్ వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. కోసం ఇక్కడ క్లిక్ చేయండి..