
‘ఇరాన్ తన యుద్ధ వ్యూహం మార్చుకుంది’ అనడం రాంగ్ వర్షన్. ఎవరూ ఊహించని వ్యూహంతో వెళ్తోంది అనడం కరెక్ట్ ఆన్సర్. జబ్బు పడ్డాక టాబ్లెట్ వాడడం కాదు.. వ్యాక్సిన్‌తో ఆ జబ్బే రాకుండా చేయడం పర్ఫెక్ట్ స్ట్రాటజీ. అందులో భాగమే.. ఈ అటాక్స్. ఈ వ్యూహం రెండువైపుల పదునున్న కత్తి లాంటిది. ఒకటి.. యుద్ధంలో అమెరికాను దెబ్బకొట్టొచ్చు. రెండు.. టెక్ దిగ్గజాలను కొట్టడం ద్వారా అమెరికా ఆర్థిక వ్యవస్థను కుప్పకూల్చొచ్చు. ఎప్పటికైనా ఓటమి తప్పదనే యుద్ధభూమిలోకి దిగింది ఇరాన్. బట్, ఓడేముందు చావుదెబ్బ తీయాలనుకుంది. సరిగ్గా అనుకున్నదే చేస్తోంది. నెల రోజులైనా సరే.. ఇప్పటికీ అమెరికా F-35 వార్ జెట్స్‌ను కూల్చేస్తోంది. శత్రు దేశ మిస్సైల్స్ రాకను సెకన్లలో పనిగట్టి చెప్పే రాడార్లనే ఇరాన్ నాశనం చేస్తోంది. అమెరికా.. వందల కోట్ల రూపాయలు ఖర్చు చేసి మిస్సైల్స్ అండ్ డిఫెన్స్ సిస్టమ్స్‌ను తయారు చేసి పెట్టుకుంటే.. ఇరాన్ జస్ట్ లక్షల రూపాయల ఖర్చుతో తయారు చేసిన డ్రోన్లతో లేపేస్తోంది. అందుకే.. టెహ్రాన్ ఇచ్చిన వార్నింగ్‌కు టెక్ కంపెనీలు గజగజ వణుకుతున్నాయ్. ఇరాన్ ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్.. ఓ డెత్ వారెంట్ ఇచ్చింది. మొత్తం 18 అమెరికా టెక్ అండ్ డిఫెన్స్ కంపెనీలను తన హిట్...