ఇక నుంచి యూఎస్‌లో H-1B, L-1 వీసా దారుల జీవిత భాగస్వాములు వారి పని అధికారాల (EAD) ఎంప్లాయ్మెంట్ ఆథరైజేషన్ డాక్యుమెంట్ కోసం ఆటోమేటిక్ పొడిగింపులను పొందుతారు. ఈ మేరకు బైడెన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. H-4 లేదా L-2 వీసాపై అర్హత పొందిన జీవిత భాగస్వాములు సకాలంలో EAD పునరుద్ధరణ దరఖాస్తు దాఖలు చేసిన వారి తీర్పు పెండింగ్‌లో ఉన్నట్లయితే, వారి ఉపాధి అధికార పత్రం (EAD) ఆటోమేటిక్‌గా 180 రోజుల వరకు పొడగింపు పొందుతారు. అయినప్పటికీ H-4 జీవిత భాగస్వాములకు సంబంధించిన అనేక ఆందోళనలు ఉన్నాయి. దీని సంబంధించి ప్రవాసభారతీయులు హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశారు. H-4 జీవిత భాగస్వాములకు సంబంధించిన అనేక ప్రశ్నాలకు సమాధానాలు ఇస్తున్నారు.
ప్ర: నా జీవిత భాగస్వామి ప్రస్తుతం U.S.లో H-4 హోదాలో ఉన్నారు. చెల్లుబాటు అయ్యే పని అధికారంతో పని చేస్తున్నారు. నా H-4 జీవిత భాగస్వామి యొక్క EAD ఆటోమేటిక్‌గా పొడిగిస్తారా..?
జ: EAD పొడిగింపు అవసరమయ్యే ప్రతి వ్యక్తి దాని కోసం దరఖాస్తు చేసుకోవాలి. EAD కేవలం సమయం గడిచే కొద్దీ పొడిగించరు. కొత్త పాలసీ మార్పుల ప్రకారం EAD “ఆటోమేటిక్‌గా పొడిగించబడుతుంది. EADని పునరుద్ధరించడానికి I-765 దరఖాస్తు EAD గడువు తేదీకి ముందు దాఖలు చేయాలి.
ప్ర: కొత్త పాలసీ మార్పుల ప్రకారం, నిర్దిష్ట ప్రమాణాలు పాటిస్తే నిర్దిష్ట డిపెండెంట్ కేటగిరీలు తమ ఎంప్లాయ్మెంట్ ఆథరైజేషన్ డాక్యుమెంట్ (EAD) యొక్క ఆటోమేటిక్ ఎక్స్టెన్షన్కు అర్హత పొందవచ్చా?
జ:పైన పేర్కొన్న వాటి ఆధారంగా, ప్రస్తుతం H-4 హోదాలో ఉన్న మీ జీవిత భాగస్వామి ఆటోమేటిక్ EAD పొడిగింపుకు అర్హులు.
ప్ర:H-4 EADని కలిగి ఉన్న నా జీవిత భాగస్వామి తన EAD పొడిగింపు దరఖాస్తును దాఖలు చేశారు. ఆమె EAD యొక్క స్వయంచాలక పొడిగింపునకు అర్హులేనా. ప్రస్తుతం ఉన్న EADలో ఎంతకాలం పని చేయడానికి అతనికి అధికారం ఉంది?
జ: EAD యొక్క స్వయంచాలక పొడిగింపునకు దరఖాస్తు చేస్తే పొడగిస్తారు. EAD గడువు ముగింపు తేదీ నుండి 180 రోజులు ఉంటుంది. EAD పొడిగింపు అప్లికేషన్ తిరస్కరిస్తే.. ఆ వ్యక్తి వెంటనే పని ఆపివేయాలి.
ప్ర: నా జీవిత భాగస్వామి తన I-9 ధృవీకరణ కోసం పత్రాలను సమర్పించాలి. అతను ఇప్పుడే నవంబర్‌లో తన EAD పొడిగింపు దరఖాస్తును దాఖలు చేశాడు.అతని EAD గడువు డిసెంబర్ 3, 2021న ముగిసింది. అతను ఏ పత్రాలను సమర్పించాలి?
జ: స్వయంచాలక పొడిగింపు కోసం అర్హత పొందిన EAD పునరుద్ధరణ అప్లికేషన్ పెండింగ్‌లో ఉండగా.. I-9 ధృవీకరణ పత్రాలు సమర్పించాలి. చెల్లుబాటు అయ్యే H-4, E లేదా L-2 వలసేతర స్థితిని చూపుతున్న గడువు లేని ఫారమ్ I-94, ఫారమ్ I-797C రసీదు సమర్పించాలి
ప్ర: నా భర్త జనవరి 8, 2022న L-2 వీసాపై U.S.కి వస్తున్నారు. అతనికి ఇప్పటికే జాబ్ ఆఫర్ ఉంది. అతను ఎప్పుడు పని ప్రారంభించవచ్చు?
జ: కొత్త EAD పాలసీ ప్రకారం L-2 వీసాపై ఉన్న జీవిత భాగస్వామి స్వయంచాలకంగా పని చేయడానికి అధికారం కలిగి ఉంటారు. వారు ఎంప్లాయ్మెంట్ ఆథరైజేషన్ డాక్యుమెంట్ లేదా EAD కార్డ్ కోసం వేచి ఉండాల్సిన అవసరం లేదు. ఇతర డిపెండెంట్ల నుండి E మరియు L ఆధారిత జీవిత భాగస్వాములను వేరు చేయడానికి ఫారమ్ I-94ని సవరించడానికి డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ (DHS) అవసరమైన చర్యలు తీసుకుంటోంది.
ప్ర: ప్రస్తుతం చెల్లుబాటు అయ్యే L-2 నాన్-ఇమ్మిగ్రెంట్ డిపెండెంట్ స్టేటస్‌లో ఉన్న నా జీవిత భాగస్వామి భవిష్యత్తులో ఆమె EAD కోసం దరఖాస్తు చేయనవసరం లేదని భావించడం సరైనదేనా?
జ: L-2 లేదా E జీవిత భాగస్వామి స్థితిని చూపే చెల్లుబాటు అయ్యే I-94 పత్రం ప్రవేశం, జారీ అయిన తర్వాత, E మరియు L వలసేతర జీవిత భాగస్వాములు EAD కోసం దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదు.
Read Also.. Gautam Raghavan: ప్రవాసభారతీయుడికి వైట్ హౌస్‌లో కీలక పదవి.. వైట్ హౌస్ PPOగా నియమితులైన గౌతమ్ రాఘవన్..