కొలంబియాలోమీ ఈఎస్ పీఎన్ బ్రాడ్కాస్ట్ స్టూడియోలో ఓ విచిత్రం జరిగింది. లైవ్ గా ఓ చర్చా గోష్టి జరుగుతుండగా హఠాత్తుగా స్టూడియో సెట్ ఒకటి ప్రజెంటర్ కార్లోస్ ఆర్డెజ్ పై పడింది. దీంతో ఆయన స్వల్పంగా గాయపడ్డారు. ఫుట్ బాల్ మ్యాచ్ పై జరిగిన ఈ గోష్టిలో పాల్గొన్న ఆయన అనుకోని ఈ పరిణామానికి ఖంగు తిన్నారు. ఆ సెట్ ఆయనపై పడుతున్న దృశ్యం చూసి కామెంటేటర్లు అంతా షాక్ తిని మాటరాకుండా ఉండిపోయారు. కార్యక్రమం నిలిచిపోయింది. సోషల్ మీడియాలో ఈ క్లిప్ వైరల్ అయింది. కాగా కార్లోస్ ఆర్డేజ్ ఆరోగ్య పరిస్థితిపై అనేకమంది నెటిజన్లు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఆయనకు ఏం కాలేదు కదా అని వారు ఆరా తీశారు.
అయితే అదృష్టవశాత్తూ తనకేమీ కాలేదని, మెడికల్ చెకప్ చేయించుకున్నానని, ముక్కుకు మాత్రం స్పల్ప గాయమైందని కార్లోస్ ఆ తరువాత ట్వీట్ చేశారు. తన ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేసిన వారందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు. బొగొటా నగరంలో నిన్న జరిగిన ఈ ఘటన సంచలనం కలిగించింది. టీవీ లేదా రేడియో స్టేషన్ లో ప్రత్యక్ష ప్రసార కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు అత్యంత భద్రత తీసుకోవాల్సి ఉంటుందని, స్టూడియో ఎంత నాసిరకంగా నిర్మించారన్నది ఈ సంఘటనతో నిరూపితమవుతోందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. గతంలో కూడా కొన్ని దేశాల్లో ఇలా లైవ్ కార్యక్రమాలు జరుగుతుండగా ఈ విధమైన ఘటనలు జరిగాయని వారు పేర్కొంటున్నారు. ఈఎస్ పీఎన్ ఘటన చూసైనా నిర్వాహకులు జాగ్రత్తలు తీసుకోవలసి ఉంటుందని వారు అభిప్రాయపడుతున్నారు.
TV is DANGEROUS (somehow the guy is ok) pic.twitter.com/6Kn5zFmEuC
— Brody Logan (@BrodyLogan) March 10, 2021
మరిన్ని చదవండి ఇక్కడ :