కాంట్రవర్సీ కామెంట్స్‌..కోర్టు మెట్లెక్కుతున్నబిజినెస్‌ టైకూన్స్‌

కాంట్రవర్సీ కామెంట్స్‌, ట్వీట్స్‌, దిగ్గజ వ్యాపారులను సైతం చిక్కుల్లో పడేస్తున్నాయి. కోర్టు మెట్లెక్కేలా చేస్తున్నాయి. టెస్లా సంస్థ సీఈవో ఎలాన్‌ మస్క్‌ కూడా ఈ జాబితాలో చేరిపోయారు.  గతేడాది థాయ్‌లాండ్‌లో ఫుట్‌బాల్‌ టీమ్‌ గుహలో చిక్కుకున్న ఘటనపై చేసిన వ్యాఖ్యలకు..ఇప్పుడు కోర్టులో వివరణ ఇచ్చుకోవలసి వచ్చింది. 2018 జులైలో థాయ్‌లాండ్‌ గుహల్లో ఫుట్‌బాల్‌ టీమ్‌ చిక్కుకుపోయిన సమయంలో వారిని రక్షించేందుకు ఓ స్మాల్‌ సైజ్‌ జలాంతర్గామిని రూపొందించాలని కామెంట్‌ చేశారు ఎలాన్‌ మస్క్‌. ఐతే ఆయన ప్రతిపాదనను […]

కాంట్రవర్సీ కామెంట్స్‌..కోర్టు మెట్లెక్కుతున్నబిజినెస్‌ టైకూన్స్‌
Follow us

|

Updated on: Dec 04, 2019 | 5:33 PM

కాంట్రవర్సీ కామెంట్స్‌, ట్వీట్స్‌, దిగ్గజ వ్యాపారులను సైతం చిక్కుల్లో పడేస్తున్నాయి. కోర్టు మెట్లెక్కేలా చేస్తున్నాయి. టెస్లా సంస్థ సీఈవో ఎలాన్‌ మస్క్‌ కూడా ఈ జాబితాలో చేరిపోయారు.  గతేడాది థాయ్‌లాండ్‌లో ఫుట్‌బాల్‌ టీమ్‌ గుహలో చిక్కుకున్న ఘటనపై చేసిన వ్యాఖ్యలకు..ఇప్పుడు కోర్టులో వివరణ ఇచ్చుకోవలసి వచ్చింది.

2018 జులైలో థాయ్‌లాండ్‌ గుహల్లో ఫుట్‌బాల్‌ టీమ్‌ చిక్కుకుపోయిన సమయంలో వారిని రక్షించేందుకు ఓ స్మాల్‌ సైజ్‌ జలాంతర్గామిని రూపొందించాలని కామెంట్‌ చేశారు ఎలాన్‌ మస్క్‌. ఐతే ఆయన ప్రతిపాదనను అంగీకరించని బ్రిటీష్‌ గజ ఈతగాడు వెర్నన్‌ అన్స్‌ వర్త్‌..ఇదంతా కేవలం ప్రచారం కోసమేనన్నారు. దీనిపై ఇద్దరి మధ్య ట్వీట్స్‌ వార్‌ జరిగింది. అన్స్‌వర్త్‌ను పెడో గై అని ట్వీట్‌ చేశారు మస్క్‌. ఆ పదం బాలల్ని లైంగికంగా వేధించే వ్యక్తిని పోలి ఉందని..ఇది తనను అవమానించడమేనని కోర్టుకెక్కారు అన్స్‌ వర్త్‌. ఈ కేసు విచారణ సందర్భంగా అమెరికా లాస్‌ ఏంజిల్స్‌ కోర్టుకు హాజరయ్యారు మస్క్‌. అన్స్‌వర్త్‌ లాయర్‌ అడిగిన ప్రశ్నకు సమాధానంగా బాలలపై లైంగిక దాడులు చేసే వ్యక్తి అనడం తన ఉద్దేశం కాదని వివరణ ఇచ్చారు.