
ఒక పెంపుడు కుక్క ఇంట్లో ఉన్న ఒక ఆట వస్తువుతో ఆడుకుంటూ అందులో ఉన్న లిథియం బ్యాటరీని కొరకగా అది పేలిపోయిన ఘటన అగ్రరాజ్యం అమెరికాలోని నార్త్ కరోలినా రాష్ట్రంలో వెలుగు చూసింది. ఇందుకు సంబంధించిన వీడియోను ఆ పెంపుడు కుక్క యజమనాకి డేవిడ్ సాసర్ సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం ట్రెండింగ్‌లోకి వచ్చింది. ఈ వీడిమొ లిథియం బ్యాటరీల వినయోగం ఎంత ప్రమాదకరమో, వాటి వల్ల కలిగే అనర్థాలను వివరిస్తోంది.
వివరాల్లోకి వెళ్తే.. అమెరికాలోని చాలా ప్రాంతాల్లో ప్రస్తుతం లిథియం-అయాన్ బ్యాటరీలను ఉపయోగిస్తున్నారు. అమెరికాలోని ప్రతి ఇంట్లో వివిధ ఆట బొమ్మలు, సెల్ ఫోన్లు, కొన్ని ఇ-బైక్‌లు లేదా స్కూటర్ వంటి వాటిలో కచ్చితంగా ఒక లిథియం బ్యాటరీని ఉపయోగిస్తున్నారు. అవి ఉపయోగించడానికి సురక్షితమైనవి అయినప్పటికీ వాటి వల్ల కలిగే అనర్థాలను తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే తాజాగా నార్త్ కరోలినాకు చెందిన ఫైర్ అఫీసర్ డేవిడ్ సాసర్ ఇంట్లో జరిగిన అగ్ని ప్రమాదం లిథియం బ్యాటరీల వినియోగం వల్ల కలిగే ప్రమాదాలను తెలియజేస్తుంది.
డేలిడ్ సాసర్ చెప్పిన వివరాల ప్రకారం.. తన పెంపుడు కుక్క ఒక ఆట వస్తువుతో ఆడుకుంటూ దానిని ఇంట్లోకి తీసుకొచ్చింది. తర్వాత దానిలో ఉన్న లిథియం బ్యాటరీని కొరికింది. ఇంతలో ఆ బ్యారీలోంచి పొగలు వచ్చాయి. అది చూసి పెంపుడు కుక్క వెంటనే అక్కడి నుంచి జారుకుంది. ఆ తర్వాత ఆ బ్యాటరీ నుంచి భారీగా మంటలు చెలరేగాయి. గమనించిన సాసర్, ఇతరులు వెంటనే ఆ మంటలను ఆర్పేశారు. దీంతో పెను ప్రమాదం తప్పింది.
A lithium-ion battery device burst into flames after being chewed on by a dog in North Carolina.
MORE: https://t.co/zj1PupUE42
(Video: Chapel Hill FD) pic.twitter.com/0JbxdFRkto— FOX26 News (@KMPHFOX26) October 14, 2025
ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియోను సాసర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఇలా రాసుకొచ్చాడు. మీరు లిథియం బ్యాటరీలు కలిని వస్తువులను ఛార్జ్ చేయడం పూర్తయిన తర్వాత వెంటనే వాటిని అన్‌ప్లగ్ చేయడం అలావాటు చేసుకొండి. అలాగే మీ దగ్గర ఏవైనా బ్యాటరీలు పాడైపోతే వాటిని ఎక్కడ పడితే అక్కడ పడేయకండి. ఇలా చేయడం ద్వారా వాటిని మీ పెట్స్ తినే ప్రమాదం ఉంది. కాబట్టి వాటిని ఒక నిర్థిష్ట ప్రదేశంలో ఉంచండి అని సాసర్ చెప్పుకొచ్చాడు.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.