Jeff Bezos: ‘నో స్పేస్‌ ఫర్‌ బెజోస్‌’.. అపర కుబేరుడు పెళ్లికి నిరసన సెగ

ప్రైవేట్‌ జెట్‌లు, భారీ వాహనాలతో క్లీన్ సిటీ కాస్త పొల్యూషన్‌ సిటీగా మారుతుందంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు వెనిస్ వాసులు. అంతేకాదు సెలబ్రిటీల రాకపోకలు నగరాన్ని స్తంభింపజేస్తాయంటూ... ‘నో స్పేస్‌ ఫర్‌ బెజోస్‌’ పేరుతో.. ఆ వివరాలు ఇలా ఉన్నాయి మరి.

Jeff Bezos: ‘నో స్పేస్‌ ఫర్‌ బెజోస్‌’.. అపర కుబేరుడు పెళ్లికి నిరసన సెగ
Jeff Bezos

Updated on: Jun 27, 2025 | 10:00 PM

ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చింది అనంటారు..! ఇప్పుడు వెనిస్‌ వాసులూ అదే ఫీలింగ్‌లో ఉన్నారు. అపర కుబేరుడు, అమెజాన్‌ ఫౌండర్‌ జెఫ్‌ బెజోస్‌ అదరహో అనేలా.. వెనిస్‌ వైపు ప్రపంచదేశాలు చూసేలా వెడ్డింగ్‌ ప్లాన్‌ చేసుకుంటే.. నీ పెళ్లొద్దు, నువ్వసలే రావొద్దు అంటూ నిరసనలు హోరెత్తిస్తున్నారు. మూడ్రోజుల పెళ్లి వేడుకను అడ్డుకునేందుకు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు.

ప్రైవేట్‌ జెట్‌లు, భారీ వాహనాలతో క్లీన్ సిటీ కాస్త పొల్యూషన్‌ సిటీగా మారుతుందంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు వెనిస్ వాసులు. అంతేకాదు సెలబ్రిటీల రాకపోకలు నగరాన్ని స్తంభింపజేస్తాయంటూ.. ‘నో స్పేస్‌ ఫర్‌ బెజోస్‌’ పేరుతో ఆందోళనలు ఉధృతం చేశారు. నగరంలోని కాల్వలు, సెంట్రల్‌ వెనిస్‌లోని పలు పర్యటక ప్రదేశాలను దిగ్బంధించాలని నిరసనకారులు పిలుపునిచ్చారు. నగరంలో పలుచోట్ల బెజోస్‌కు వ్యతిరేకంగా భారీ బ్యానర్లను ఏర్పాటు చేశారు.