China Coronavirus: కరోనా నుంచి ఇప్పుడిప్పుడు తేరకుంటున్న ప్రపంచాన్ని మరోసారి గడగడలాడిస్తుంది కోవిడ్. వైరస్ కు పుట్టినిల్లు అయిన చైనాలో మరోసారి కరోనా విజృంభిస్తుంది. మరోసారి భారీ స్థాయిలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. దీంతో చైనా అధికారులు కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నారు. చైనాలో కొత్తగా 32 వేల 943 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయని నేషనల్ హెల్త్ బ్యూరో తెలిపింది. కరోనా కేసులు ప్రారంభమైన నాటినుంచి చైనాలో ఒక్కరోజులో ఇంత మందికి పాజిటివ్ రావడం ఇదే మొదటిసారి కాగా.. కొత్తగా నమోదైన పాజిటివ్ కేసుల్లో 27 వేల 517 మందికి ఎలాంటి లక్షణాలు లేవని వెల్లడించింది. పెరుగుతున్న వైరస్ ను అరికట్టేందుకు చైనా అధికారులు చర్యలు ప్రారంభించారు. మళ్లీ కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నారు. లాక్‌డౌన్లను విధించి కేసులు పెరగకుండా చర్యలు తీసుకుంటున్నారు.
పెరుగుతున్న కరోనా కేసుల దృష్ట్యా చైనాలో భారీ సంఖ్యలో కరోనా టెస్ట్ లు చేస్తున్నారు. ప్రజా రవాణాను అరికడుతూ లాక్ డౌన్ లతో కరోనా వ్యాప్తిని తగ్గించేందుకు చైనా ఆరోగ్య శాఖ అధికారులు యత్నిస్తున్నారు. కరోనా సోకిన నగరాల్లో కార్యాలయాలు, రెస్టారెంట్లను మూసివేశారు. అనవసరంగా బయటకు రావద్దని ప్రజలను హెచ్చరిస్తున్నారు. లాక్ డౌన్ నేపథ్యంలో చైనాలోని యాపిల్‌కు చెందిన ఐఫోన్ ప్లాంట్‌లో ఆందోళనలు చెలరేగాయి.
ప్రభుత్వం అమలు చేస్తున్న కోవిడ్ నిబంధనలు, ఆంక్షలపై ఉద్యోగులు మండిపడుతున్నారు. జెంగ్‌జూ ప్రాంతంలో యాపిల్ తయారీ ఫ్యాక్టరీలో పనిచేసే ఉద్యోగులు బయటకు వెళ్లకుండా చర్యలు తీసుకున్నారు. ఇంటికి వేళ్లలేక తీవ్ర అవస్థలు పడ్డారు. మానసిక, శారీరిక ఒత్తిడికి గురవుతున్నారు. కరోనా ఆంక్షలతో విసుగెత్తిన ఉద్యోగులు ఒక్కసారిగా విధులు బహిష్కరించి బయటకొచ్చి నిరసనకు దిగారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం..