బ్రెగ్జిట్ పై కదిలిన బ్రిటన్.. పార్లమెంట్ వాయిదా

బ్రిటన్ పార్లమెంట్‌ సమావేశాలను అక్టోబర్ 14 వరకూ రద్దు చేసే ప్రతిపాదనకు రాణి ఎలిజబెత్ 2 ఆమోద  ముద్ర వేశారు.  బ్రెగ్జిట్‌పై ప్రతిపక్షం ఎలాంటి అడ్డుకట్ట  వేయకుండా చూసేందుకే ప్రధాని బోరిస్ జాన్సన్ వినతి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టమవుతోంది. ఈయూ నుంచి తప్పుకునేందుకు బ్రిటన్ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో కొత్త శాసన ఎజెండాను రూపొందించే దిశగా పార్లమెంట్ సమావేశాలను వాయిదా వేయాలని నిర్ణయించారు. యూరోపియన్ యూనియన్ నుంచి బయటకు వచ్చేందుకు ఎప్పుడో నిర్ణయం తీసుకున్న […]

బ్రెగ్జిట్ పై కదిలిన బ్రిటన్.. పార్లమెంట్ వాయిదా
Follow us

|

Updated on: Aug 29, 2019 | 12:22 PM

బ్రిటన్ పార్లమెంట్‌ సమావేశాలను అక్టోబర్ 14 వరకూ రద్దు చేసే ప్రతిపాదనకు రాణి ఎలిజబెత్ 2 ఆమోద  ముద్ర వేశారు.  బ్రెగ్జిట్‌పై ప్రతిపక్షం ఎలాంటి అడ్డుకట్ట  వేయకుండా చూసేందుకే ప్రధాని బోరిస్ జాన్సన్ వినతి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టమవుతోంది. ఈయూ నుంచి తప్పుకునేందుకు బ్రిటన్ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో కొత్త శాసన ఎజెండాను రూపొందించే దిశగా పార్లమెంట్ సమావేశాలను వాయిదా వేయాలని నిర్ణయించారు.

యూరోపియన్ యూనియన్ నుంచి బయటకు వచ్చేందుకు ఎప్పుడో నిర్ణయం తీసుకున్న బ్రిటన్ లో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. కొద్ది వారాల క్రితమే బ్రిటన్ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన బోరిస్ జాన్సన్ బ్రెగ్జిట్ పై తమ వైఖరిలో మార్పు లేదని చెబుతూ వచ్చారు. ఈయూ నుంచి బ్రిటన్ వైదొలిగేందుకు అక్టోబర్ 31వరకూ గడువు ఉంది..ఈ నేపథ్యంలో బోరిస్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బ్రిటన్ పార్లమెంట్ లోని దిగువ సభ హౌస్ ఆఫ్ కామన్స్‌ను అక్టోబర్ 14 వరకు రద్దు చేయాలని రాణి ఎలిజబెత్ IIను కోరారు ప్రధాని బోరిస్ జాన్సన్.. ఇందుకు వెంటనే ఆమోద ముద్ర వేశారామె. బ్రెగ్జిట్ నేపథ్యంలో సరికొత్త శాసన అజెండాను రూపొందింస్తున్నారు. ఇందుకు వీలుగా పార్లమెంట్ సమావేశాలను తాత్కాలికంగా వాయిదా వేయాలని జాన్సన్ నిర్ణయించారు.

అక్టోబర్ 14 వరకు పార్లమెంట్ సమావేశాల రద్దు కారణంగా ఎంపీలు ఎటువంటి ముఖ్యమైన చట్టాలపై చర్చించేందుకు అవకాశం ఉండదు.  బ్రెగ్జిట్‌పై ప్రతిపక్షం ఎలాంటి అడ్డుకట్ట వేయకుండా ఈ నిర్ణయం ఉపకరిస్తుంది. బోరిస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై విపక్షాలు మండిపడుతున్నాయి. బోరిస్ ప్రభుత్వ నిర్ణయాన్ని హౌస్ ఆఫ్ కామన్స్ స్పీకర్ జాన్ బెర్కో కూడా తప్పుపట్టారు. బ్రెగ్జిట్‌పై చర్చ చేపట్టకుండా నిలువరించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారని దుయ్యబట్టారు. ఇది రాజ్యాంగపరమైన దౌర్జన్యమని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా ఈయూ నుంచి వైదొలిగాక బ్రిటన్ పయనంపై కొత్త ప్రధాని నేతృత్వంలోని సర్కార్‌ నిర్ణయం తీసుకునేందుకు ఇది సరైన సమయమని విశ్లేషకులు భావిస్తున్నారు.