Air India Newark: ఎయిర్‌ఇండియా విమానానికి తప్పిన భారీ ప్రమాదం.. ప్రాణాలతో బయటపడ్డ 300 మంది ప్రయాణికులు..

ఎయిర్‌ఇండియా విమానానికి భారీ ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో ప్రాణాలతో మూడువందల మంది ప్రయాణికులు బయటపడ్డారు. అంతకుముందు విమానంలో ఆయిల్ లీకేజీని ఫైలట్లు గుర్తించారు. యూఎస్‌లోని న్యూయార్క్ నుంచి ఢిల్లీ వస్తుండగా ఈ ఘటన జరిగింది. వెంటనే స్వీడన్‌ రాజధాని స్టాక్‌హోంలో ఎమర్జెన్సీ ల్యాండింగ్‌ చేశారు పైలెట్లు.

Air India Newark: ఎయిర్‌ఇండియా విమానానికి తప్పిన భారీ ప్రమాదం.. ప్రాణాలతో బయటపడ్డ 300 మంది ప్రయాణికులు..
Air India Newark

Updated on: Feb 22, 2023 | 11:50 AM

ఎయిర్‌ఇండియా విమానానికి పెద్ద ప్రమాదం తప్పింది. సాంకేతిక లోపం కారణంగా అమెరికా నుంచి ఢిల్లీకి బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం స్టాక్‌హోమ్ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ అయింది. ల్యాండింగ్ సమయంలో విమానంలో 300 మంది ప్రయాణికులు ఉన్నారు. అందరూ క్షేమంగా ఉన్నట్లుగా సమాచారం. అయితే ఎలాంటి ప్రమాదం జరగకుండా ఇప్పటికే అగ్నిమాపక సిబ్బందిని విమానాశ్రయంలో మోహరించారు. విమానం ల్యాండ్ అయ్యే సరికే రన్‌వేపై సిద్ధంగా ఉన్నాయి పెద్ద ఎత్తున ఫైరింజన్లు. సకాలంలో ల్యాండ్ అవ్వడంతో తప్పిన ముప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఆయిల్ లీక్ అయిన తర్వాత ఇంజన్ షట్ డౌన్ అయిందని, ఆ తర్వాత విమానం స్టాక్‌హోమ్‌లో సురక్షితంగా ల్యాండ్ అయిందని సీనియర్ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) అధికారి తెలిపారు.

గ్రౌండ్‌ ఇన్‌స్పెక్షన్‌లో రెండో ఇంజన్‌లోని డ్రైన్‌ మాస్ట్‌ నుంచి ఆయిల్‌ బయటకు రావడం కనిపించిందని అధికారి తెలిపారు. అంతకుముందు సోమవారం (ఫిబ్రవరి 20) న్యూయార్క్ నుండి ఢిల్లీ వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానాన్ని మెడికల్ ఎమర్జెన్సీ కారణంగా లండన్‌కు మళ్లించారు.

ఎయిర్ ఇండియా విమానం ఆలస్యం

అదే సమయంలో, ఢిల్లీ విమానాశ్రయంలో మంగళవారం (ఫిబ్రవరి 21) ఆలస్యంగా ముంబైకి వెళ్తున్న ఎయిరిండియా విమానంలో ప్రయాణీకులు, ఎయిర్‌లైన్ సిబ్బంది మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. విమానం నాలుగు గంటలకు పైగా ఆలస్యం అయింది. ఢిల్లీ-ముంబై ఫ్లైట్‌లో ఉన్న ఒక ప్రయాణికుడు ANIకి AI-805 విమానం సమయం రాత్రి 8 గంటలని, అయితే అది మూడుసార్లు మార్చబడిందని చెప్పారు. దాదాపు మధ్యాహ్నం 12.30 గంటలకు విమానం బయలుదేరింది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం

Loading...
Unable to load recommendations.
Follow Us