Prize Money: అబ్బాయి చేతిలో మోసపోయిన గర్ల్ ఫ్రెండ్.. కట్ చేస్తే, ఏం చేసిందో తెలుసా..?

|

Jan 05, 2024 | 5:25 PM

సాధారణంగా ప్రేమ ముసుగులో అమ్మాయిలు అబ్బాయిల చేతిలో మోసపోతూ ఉంటారు. ఈమధ్య కాలంలో అయితే అబ్బాయిలు కూడా అమ్మాయిల ద్వారా మోసానికి గురవుతున్నారు. అయితే తనను మోసగించిన బాయ్ ఫ్రెండ్ పై ఒక యువతి ఓ రేంజ్లో రివెంజ్ తీర్చుకున్నారు. దీంతో ఆమెకు ప్రభుత్వం నుంచి బంపర్ ఆఫర్ వరించింది.

Prize Money: అబ్బాయి చేతిలో మోసపోయిన గర్ల్ ఫ్రెండ్.. కట్ చేస్తే, ఏం చేసిందో తెలుసా..?
America Girl Friend
Follow us on

సాధారణంగా ప్రేమ ముసుగులో అమ్మాయిలు అబ్బాయిల చేతిలో మోసపోతూ ఉంటారు. ఈమధ్య కాలంలో అయితే అబ్బాయిలు కూడా అమ్మాయిల ద్వారా మోసానికి గురవుతున్నారు. అయితే తనను మోసగించిన బాయ్ ఫ్రెండ్ పై ఒక యువతి ఓ రేంజ్లో రివెంజ్ తీర్చుకున్నారు. దీంతో ఆమెకు ప్రభుత్వం నుంచి బంపర్ ఆఫర్ వరించింది. ఈ ఘటన అమెరికాలో వెలుగులోకి వచ్చింది. అయితే ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‎గా మారింది.

తనను మోసం చేసిన బాయ్‌ఫ్రెండ్‌పై బాధిత మహిళ ఎలా పగ తీర్చుకుందీ చెబుతూ ఏవా లూయీ అనే పేరుతో సరికొత్త కంటెంట్ క్రియేటర్ చేశారు. గతంలో తనకు.. బాయ్‌ఫ్రెండ్ చెప్పిన అంశాలపై సోషల్ మీడియాలో టిక్ టాక్ చేస్తూ పోస్ట్ చేస్తూ వచ్చారు. ఏవా.. తన బాయ్ ఫ్రెండ్ సన్నిహితంగా ఉన్న సమయంలో రాబట్టిన రహస్య అంశాలను ప్రస్తావిస్తూ వచ్చారు. ఒకసారి తాను ప్రభుత్వానికి ట్యాక్స్ కట్టకుండా ఎలా ఎగరగొట్టాడో ఆ విషయాన్ని టిక్ టాక్ ద్వారా పంచుకుంది గర్ల్ ఫ్రెండ్ ఏవా. తన బాయ్‌ఫ్రెండ్ పన్ను ఎగ్గొట్టిన విషయాన్ని ఆదాయపు పన్ను శాఖ అధికారులకు చెప్పింది. దీంతో ఏవా బాయ్ ఫ్రెండ్ ను పట్టుకునే పనిలో ఉన్నారు పోలీసులు. అయితే ఇంతటి క్లూ ఇచ్చినందుకు ప్రభుత్వం తరఫున ఏవాకు రూ. 83 లక్షల నజరానా అందించారు ఇన్‎కం ట్యాక్స్ అధికారులు.

అమెరికా చట్టాల ప్రకారం, పన్ను ఎగవేతదారుల వివరాలు బట్టబయలు చేసిన వారికి ప్రభుత్వం భారీ నజరానా అందిస్తుంది. అయితే, అలా ఎగవేతకు గురైన సొమ్ము దాదాపు రెండు మిలియన్ డాలర్లకు పైబడి ఉండాలి. అప్పుడే ఇలాంటి బంపర్ ఆఫర్లు వివరాలు అందజేసిన వారికి దక్కుతాయి. పన్ను ఎగవేతదారుల నుంచి అధికారులు రికవరీ చేసిన మొత్తంల్లో సుమారు 15 నుంచి 30 శాతం వరకూ సమాచారం అందజేసిన వారికి చెల్లిస్తారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..