మందుబాబులకు గుడ్ న్యూస్.. ఐదు రోజులు తెరుచుకోనున్న మద్యం షాపులు..

కోవిద్ 19 కరాళ నృత్యం చేస్తోంది. ఈ వైరస్ ఇప్పుడు భారత్ లోనూ విజృంభిస్తోంది. ఈ క్రమంలో దేశవ్యాప్త లాక్ డౌన్ విధించిన విషయం తెలిసిందే. లాక్ డౌన్ కారణంగా లిక్కర్ షాపులు మూతపడటంతో మద్యం ప్రియులు చాలా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. కొన్ని చోట్ల అయితే నోట్లోకి చుక్క పోక పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తున్నారు. అయితే మద్యం ప్రియుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని మేఘాలయా సర్కార్ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. సోమవారం (ఏప్రిల్-13,2020)నుంచి శుక్రవారం(ఏప్రిల్-17,2020) రాష్ట్రంలో […]

మందుబాబులకు గుడ్ న్యూస్.. ఐదు రోజులు తెరుచుకోనున్న మద్యం షాపులు..
Follow us

| Edited By:

Updated on: Apr 12, 2020 | 5:15 PM

కోవిద్ 19 కరాళ నృత్యం చేస్తోంది. ఈ వైరస్ ఇప్పుడు భారత్ లోనూ విజృంభిస్తోంది. ఈ క్రమంలో దేశవ్యాప్త లాక్ డౌన్ విధించిన విషయం తెలిసిందే. లాక్ డౌన్ కారణంగా లిక్కర్ షాపులు మూతపడటంతో మద్యం ప్రియులు చాలా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. కొన్ని చోట్ల అయితే నోట్లోకి చుక్క పోక పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తున్నారు. అయితే మద్యం ప్రియుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని మేఘాలయా సర్కార్ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. సోమవారం (ఏప్రిల్-13,2020)నుంచి శుక్రవారం(ఏప్రిల్-17,2020) రాష్ట్రంలో మద్యం షాపులు తెరవనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.

కాగా.. ఈ ఆరు రోజులు ఉదయం 9గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు మద్యం షాపులు తెరిచి ఉండనున్నట్లు మేఘాలయ ప్రభుత్వం ఓ ప్రకటనలో తెలిపింది. అయితే కస్టమర్లు షాపుల వద్ద దాదాపు 1మీటర్ వరకు సోషల్ డిస్టెన్సింగ్ పాటించాల్సి ఉంటుందని పేర్కొంది. ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతం లేదా ఒక గ్రామం నుంచి మరొక గ్రామానికి వెళ్లడంపై నిషేధం ఉంటుందన్న ప్రభుత్వం కేవలం ఇంటికి ఒక్కరినే వైన్ షాపు దగ్గరకు వెళ్లేందుకు అనుమతిస్తున్నట్లు తెలిపింది.

కోవిద్ 19 ఇప్పుడు దేశంలోని అన్ని ప్రాంతాలకు విస్తరిస్తోంది. కాబట్టి వైన్ షాపులలో సిబ్బంది తక్కువగా ఉండాలని, మద్యం బాటిళ్లు మరియు నగదును తీసుకునేటప్పుడు లేదా ఇచ్చేటప్పుడు వినియోగదారులకు మరియు సిబ్బందికి హ్యాండ్ శానిటైజర్లను అందించాలని తెలిపింది. అంతేకాకుండా జనసంచారం ఎక్కువగా లేకుండా చేసేందేకు తమ దగ్గరకు వచ్చిన కస్టమర్లకు సంబంధిత వైన్ షాపు సిబ్బంది అదే ఏరియాలోని లేదా గ్రామంలోని మరో వైన్ షాపుకు పంపిచవచ్చని తెలిపింది. అయితే మేఘాలయ రాష్ట్రంలో ఒక్క కరోనా కేసు కూడా నమోదు అవలేదన్న విషయం తెలిసిందే.