Breaking News
  • ప్రధాని శంకుస్థాపన చేసిన రాజధానిని మార్చే హక్కు ఎవరికీ లేదు. సుప్రీంకోర్టు, రాష్ట్రపతి ఒప్పుకుంటేనే హైకోర్టు కదులుతుంది-కేశినేని. అమరావతి రక్షణకు పార్లమెంటు వేదికగా పోరాటం చేస్తాం-కేశినేని.
  • చిత్తూరు: తిరుచానూరు పీఎస్‌ నుంచి బేడీలతో పరారైన దొంగ. ట్రాక్టర్‌ దొంగతనం కేసులో నాగరాజును అరెస్ట్‌చేసిన పోలీసులు. దొంగ నాగరాజు కోసం గాలిస్తున్న పోలీసులు.
  • ఢిల్లీ: ఆప్‌ ప్రభుత్వంపై బీజేపీ తీవ్ర విమర్శలు. నిర్భయ దోషులను రక్షించేందుకు ఆప్‌ ప్రభుత్వం యత్నిస్తోంది. కావాలనే న్యాయ ప్రక్రియను ఆలస్యం చేస్తోంది-మనోజ్‌ తివారీ. పోలీసులు తమ పరిధిలో లేరని తప్పించుకోవాలని ఆప్‌ చూస్తోంది -బీజేపీ ఢిల్లీ చీఫ్‌ మనోజ్‌ తివారీ.
  • అనంతపురం: తాడిపత్రిలో కత్తిపోట్లు. డబ్బుల విషయంలో స్నేహితుల మధ్య ఘర్షణ. రాము అనే వ్యక్తిని కత్తితో పొడిచిన రవితేజ. ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందిన రాము.
  • రైతులు కన్నీళ్లు పెట్టినా సీఎం మనసు కరగడం లేదు. రాష్ట్రంలో పోలీస్‌ రాజ్యం నడుస్తోంది-దేవినేని ఉమ. విశాఖలో భూదందా నడుస్తోంది-మాజీ మంత్రి దేవినేని ఉమ. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం కోసం రాజధానిని విశాఖకు తరలిస్తున్నారు. పులివెందుల పులి డమ్మీ కాన్వాయ్‌తో వెళ్తోంది. దేశ చరిత్రలో డమ్మీ కాన్వాయ్‌తో వెళ్లిన సీఎం చరిత్రలో లేరు. సచివాలయానికి వెళ్లేందుకు మెటల్‌ రోడ్డు వేసుకుంటున్నారు. 5 కోట్ల మంది ప్రజలు రేపు రోడ్లపైకి రావాలి-దేవినేని ఉమ.

అశ్వనీదత్ సెంటిమెంట్ మహేశ్‌కు కలిసొస్తుందా..!

, అశ్వనీదత్ సెంటిమెంట్ మహేశ్‌కు కలిసొస్తుందా..!

సూపర్‌స్టార్ మహేశ్ బాబు నటిస్తోన్న మహర్షికి కొత్త విడుదల తేది వచ్చింది. ఏప్రిల్‌లోనే ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని దర్శకనిర్మాతలు ప్రయత్నించినప్పటికీ.. చిత్రీకరణలో జాప్యం వలన మే 9కు విడుదల వాయిదా పడింది. అయితే ఈ తేదిపై మహేశ్ అభిమానుల్లో ఆందోళన నెలకొంది. గతంలో మే నెలలో మహేశ్ నటించిన నాని, బ్రహ్మోత్సవం విడుదల కాగా.. ఆ రెండు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. దీంతో ఇప్పుడు మహర్షి కూడా అదే ఫలితాన్ని అందుకుంటుందేమోనని వారు ఫీల్ అవుతున్నారు.

ఇదిలా ఉంటే అశ్వనీదత్ సెంటిమెంట్ మహేశ్‌కు కలిసొస్తుందేమోనని కొందరు అభిప్రాయపడుతున్నాయి. మహర్షిని తెరకెక్కించిన నిర్మాతలలో అశ్వనీదత్ ఒకరు కాగా.. ఆయనకు మే నెల, అందునా 9వ తేది మంచి సెంటిమెంట్ ఉంది. 29సంవత్సరాల క్రితం అదే రోజున విడుదలైన జగదేకవీరుడు అతిలోకసుందరి నిర్మాతగా అశ్వనీదత్‌కు భారీ లాభాలను ఇచ్చింది. అలాగే గతేడాది మే9న విడుదలైన ‘మహానటి’ ఎంతటి విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందుకే దే సెంటిమెంట్‌తో ఇప్పుడు మహర్షిని మే9న విడుదల చేయాలని అశ్వనీదత్ సూచించారట. మొత్తానికి మహర్షి ఎవరి సెంటిమెంట్‌ను బ్రేక్ చేస్తుందో చూడాలంటే రెండు నెలలు ఆగాల్సిందే.