హుజూర్ నగర్‌ సీటుపై కన్నేసిన టీఆర్ఎస్..?

తెలంగాణలో మళ్లీ ఉపఎన్నికల జోరు మొదలైంది. ఇప్పుడు అందరి చూపు హుజుర్ నగర్ బై ఎలక్షన్స్ పైనే ఉంది. ఈ సారి కాంగ్రెస్ తరపున ఉత్తమ్ భార్య పద్మావతి పోటీ చేస్తారని తెలుస్తోంది. అయితే ఈ సారి హుజుర్ నగర్ ఉప ఎన్నిక టీఆర్ఎస్‌కు పరీక్ష పెట్టనుంది. నల్గొండ ఎంపీ సీటు కోల్పోయిన పరాభవంలో ఉన్న ఆ పార్టీ ఈ సీటును దక్కించుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నట్లు కనిపిస్తోంది. అయితే ఆ పార్టీ నుంచి ఎవరు పోటీ […]

హుజూర్ నగర్‌ సీటుపై కన్నేసిన టీఆర్ఎస్..?
Follow us

| Edited By:

Updated on: Sep 13, 2019 | 1:07 PM

తెలంగాణలో మళ్లీ ఉపఎన్నికల జోరు మొదలైంది. ఇప్పుడు అందరి చూపు హుజుర్ నగర్ బై ఎలక్షన్స్ పైనే ఉంది. ఈ సారి కాంగ్రెస్ తరపున ఉత్తమ్ భార్య పద్మావతి పోటీ చేస్తారని తెలుస్తోంది. అయితే ఈ సారి హుజుర్ నగర్ ఉప ఎన్నిక టీఆర్ఎస్‌కు పరీక్ష పెట్టనుంది. నల్గొండ ఎంపీ సీటు కోల్పోయిన పరాభవంలో ఉన్న ఆ పార్టీ ఈ సీటును దక్కించుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నట్లు కనిపిస్తోంది. అయితే ఆ పార్టీ నుంచి ఎవరు పోటీ చేస్తారనేది ఇంకా క్లియర్ గా తెలియదు. ఓ వైపు ఈ సారి మాజీ ఎంపి కవిత రంగంలోకి దిగబోతున్నారని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

ఇక గత ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన శానం పూడి సైదిరెడ్డి ఇప్పుడు కూడా రేసులో ఉన్నారని పార్టీ నేతలు చెబుతున్నారు. సైది రెడ్డి తండ్రి అంకి రెడ్డి గతంలో గుండ్లపల్లి సర్పంచ్‌గా పనిచేశారు. టీడీపీలో మఠంపల్లి మండలం ప్రధాన నాయకుడిగా కూడా వ్యవహరిస్తూ వచ్చారు. మఠంపల్లి మండల కేంద్రంలోనూ పెదవీడు వంటి చుట్టుపక్కల గ్రామాల్లోనూ సైదిరెడ్డి బంధువర్గం విశేషంగా ఉంది. రాజకీయంగానే కాదు.. సేవా కార్యక్రమాల్లోనూ సైదిరెడ్డి ముందున్నారు. తన తండ్రి అంకిరెడ్డి పేరు మీద అంకిరెడ్డి ఫౌండేషన్ స్థాపించి.. తన సొంత డబ్బులతో హుజూర్ నగర్ నియోజకవర్గంలో సేవాకార్యక్రమాలు చేపడుతున్నారు. ప్రస్తుతం ఆయనే నియోజకవర్గ ఇన్ చార్జ్ గా వ్యవహరిస్తున్నారు. 2009 నుంచి హుజూర్ నగర్ లో జరిగిన మూడు ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ కు చేదు ఫలితమే ఎదురైంది.

ఇక మంత్రి జగదీశ్ రెడ్డి కూడా తొలిసారి ఇక్కడి నుంచే పోటీ చేసి ఓడిపోయారు. తెలంగాణ రాష్ట్రం అవతరించిన తర్వాత 2014, జూన్ 2న.. ఆ రాష్ట్ర మంత్రిగా ఈయన ప్రమాణ స్వీకారం చేశారు. కేసీఆర్ తొలి మంత్రి వర్గంలో విద్యా, విద్యుత్ శాఖల బాధ్యతలు నిర్వర్తించాడు. ఇక 2019లో కేసీఆర్ రెండవ మంత్రివర్గంలో విద్యాశాఖ మంత్రి జగదీశ్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. 2014లో కాసోజు శంకరమ్మకు టికెట్ ఇచ్చినా ఫలితం దక్కలేదు. తర్వా త జగదీశ్ రెడ్డి వర్గీయుడు సైదిరెడ్డిని పోటీకి దింపింది. కానీ భంగపాటు మాత్రం తప్పలేదు. 2015 నుంచి రాష్ట్రంలో జరిగిన ఉప ఎన్నికలన్నింటినీ అధికార పార్టీ గెలుచుకోడం ఒక్కటే కలిసొచ్చే అంశం. ఈ సారి టీఆర్ఎస్ నుంచి కవిత పోటీలోకి దిగితే.. కవిత వర్సెస్ పద్మావతి.. ఢీ అంటే ఢీ అంటూ పోటీ పడనున్నట్లు తెలుస్తోంది. ఈక్రమంలో హుజూర్ నగర్ బై ఎలక్షన్‌కు టఫ్ ఫైట్ తప్పదని స్పష్టమవుతోంది.

మీ మొబైల్‌కు వచ్చే ఫేక్‌ మెసేజ్‌లను ఎలా గుర్తించాలి ?
మీ మొబైల్‌కు వచ్చే ఫేక్‌ మెసేజ్‌లను ఎలా గుర్తించాలి ?
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో