“హిందుత్వ”కి వ్యతిరేకం.. కానీ హిందూయిజానికి కాదు

తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తామన్న బీజేపీ నేతలపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక్కడ హిందూయిజం పేరుతో అధికారం చేపట్టాలనుకోవడం కలగానే మిగులుతుందని అన్నారు. ప్రధాని మోదీ రెండు దేవాలయాలకు వెళ్తే.. తెలంగాణ సీఎం కేసీఆర్ ఆరు దేవాలయాలకు వెళ్తారని అన్నారు. కేసీఆర్ లాంటి ధృడమైన హిందువును.. హిందూయిజం పేరుతో బీజేపీ పాగా వేయాలనుకోవడం సాధ్యం కాదని అన్నారు. అంతేకాదు తాము హిందూయిజానికి వ్యతిరేకం కాదని.. కేవలం హిందుత్వ విధానాలకు వ్యతిరేకిస్తామని అసదుద్దీన్ […]

హిందుత్వకి వ్యతిరేకం.. కానీ హిందూయిజానికి కాదు
Follow us

| Edited By:

Updated on: Jul 06, 2019 | 8:51 AM

తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తామన్న బీజేపీ నేతలపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక్కడ హిందూయిజం పేరుతో అధికారం చేపట్టాలనుకోవడం కలగానే మిగులుతుందని అన్నారు. ప్రధాని మోదీ రెండు దేవాలయాలకు వెళ్తే.. తెలంగాణ సీఎం కేసీఆర్ ఆరు దేవాలయాలకు వెళ్తారని అన్నారు. కేసీఆర్ లాంటి ధృడమైన హిందువును.. హిందూయిజం పేరుతో బీజేపీ పాగా వేయాలనుకోవడం సాధ్యం కాదని అన్నారు. అంతేకాదు తాము హిందూయిజానికి వ్యతిరేకం కాదని.. కేవలం హిందుత్వ విధానాలకు వ్యతిరేకిస్తామని అసదుద్దీన్ ఓవైసీ స్పష్టం చేశారు.