‘ మేమే గెలుస్తాం ‘.. జార్ఖండ్ సీఎం రఘువర దాస్ ధీమా

ఝార్ఖండ్ లో జరిగిన ఎన్నికల్లో జేఎంఎం, కాంగ్రెస్ కూటమి ఆధిక్యంలో కొనసాగుతుండగా.. బీజేపీ వెనుకబడింది. చూడబోతే కమలం పార్టీకి ఈ ఎన్నికల్లో గట్టి ఎదురుదెబ్బ తగులవచ్ఛునని తెలుస్తోంది. అయితే తాము విజయం సాధించి తీరుతామని, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని సీఎం, బీజేపీ నేత రఘువర్ దాస్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. జంషెడ్ పూర్ ఈస్ట్ నియోజకవర్గంలో ఆయన తన సమీప ప్రత్యర్థికన్నా ఆధిక్యంలో కొనసాగుతున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో 37 సీట్లు గెలుచుకున్న బీజేపీ.. ‘ అబ్ […]

' మేమే గెలుస్తాం '.. జార్ఖండ్ సీఎం రఘువర దాస్ ధీమా
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Dec 23, 2019 | 2:55 PM

ఝార్ఖండ్ లో జరిగిన ఎన్నికల్లో జేఎంఎం, కాంగ్రెస్ కూటమి ఆధిక్యంలో కొనసాగుతుండగా.. బీజేపీ వెనుకబడింది. చూడబోతే కమలం పార్టీకి ఈ ఎన్నికల్లో గట్టి ఎదురుదెబ్బ తగులవచ్ఛునని తెలుస్తోంది. అయితే తాము విజయం సాధించి తీరుతామని, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని సీఎం, బీజేపీ నేత రఘువర్ దాస్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. జంషెడ్ పూర్ ఈస్ట్ నియోజకవర్గంలో ఆయన తన సమీప ప్రత్యర్థికన్నా ఆధిక్యంలో కొనసాగుతున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో 37 సీట్లు గెలుచుకున్న బీజేపీ.. ‘ అబ్ కీ బార్ 65 పర్ ‘ అనే స్లోగన్ ని ఎత్తుకుంది. కానీ ఝార్ఖండ్ ముక్తి మోర్చా- కాంగ్రెస్ కూటమి నుంచి ఊహించని ‘ దెబ్బ ‘ ను ఎదుర్కొంటోంది.

ఝార్ఖండ్ లో బీజేపీ, జేఎంఎం, కాంగ్రెస్ పార్టీలతో బాటు ఆర్జేడీ, ఆల్ ఝార్ఖండ్ స్టూడెంట్స్ యూనియన్, ఝార్ఖండ్ వికాస్ మోర్చా ప్రజా తాంత్రిక్ వంటి పార్టీలు కూడా పోటీ చేస్తున్నాయి. గత ఎన్నికల్లో బీజేపీ.. ఆల్ ఝార్ఖండ్ స్టూడెంట్స్ యూనియన్ తో పొత్తు పెట్టుకుంది. (ఈ పార్టీ 5 సీట్లు గెలుచుకుంది). అయితే ఈ సారి జరిగిన ఎన్నికల్లో మాత్రం ఆల్ ఝార్ఖండ్ స్టూడెంట్స్ యూనియన్..బీజేపీతో పొత్తు వదులుకుని ఒంటరిగా బరిలోకి దిగింది. అటు- ఈ ఎన్నికల్లో ఫలితాలు తమకు అనుకూలంగా వస్తున్నట్టు వార్తలు రావడంతో ముఖ్యంగా కాంగ్రెస్ శిబిరాల్లో హర్షం వ్యక్తమవుతోంది.

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు