గంజాయి స్మగ్లింగ్ ముఠాకు బీఎస్ఎఫ్‌ చెక్..

గుట్టుచప్పుడు కాకుండా వెస్ట్ బెంగాల్‌ నుంచి బంగ్లాదేశ్‌కు గంజాయితో పాటు.. నార్కోటిక్‌ డ్రగ్స్‌ను సరఫరా చేస్తున్న ముఠాకు బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ చెక్ పెట్టింది. వెస్ట్ బెంగాల్‌లోని సరిహద్దు జిల్లాల మీదుగా..

  • Tv9 Telugu
  • Publish Date - 12:15 am, Tue, 7 July 20
గంజాయి స్మగ్లింగ్ ముఠాకు బీఎస్ఎఫ్‌ చెక్..

గుట్టుచప్పుడు కాకుండా వెస్ట్ బెంగాల్‌ నుంచి బంగ్లాదేశ్‌కు గంజాయితో పాటు.. నార్కోటిక్‌ డ్రగ్స్‌ను సరఫరా చేస్తున్న ముఠాకు బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ చెక్ పెట్టింది. వెస్ట్ బెంగాల్‌లోని సరిహద్దు జిల్లాల మీదుగా బంగ్లాదేశ్‌కు తరలించేందుకు ప్రయత్నిస్తున్న ముఠాను బీఎస్ఎఫ్ గుర్తించింది. వారి వద్ద నుంచి పెద్ద ఎత్తున గంజాయితో పాటు.. దగ్గు మందు బాటిల్స్‌ను స్వాధీనం చేసుకుంది. స్వాధీనం చేసుకున్న గంజాయి 31.5 కిలోలు ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఇక దగ్గు మందుకు సంబంధించిన బాటిల్స్‌ విలువ రూ.61 వేలకు పైగా ఉంటుందని పేర్కొన్నారు. అంతర్జాతీయ సరిహద్దు నుంచి బార్డర్‌ దాటుతూ.. వీటిని సప్లే చేసేందుకు ఈ ముఠా ప్రయత్నించినట్లు అధికారులు వెల్లడించారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను స్థానిక పోలీసులకు అందజేశారు. వీరిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.