సీమలో హీటెక్కిన రాజకీయం : గోరంట్ల వెర్సస్ శ్రీరామ్..ఇద్దరి మధ్య పేలుతోన్న మాటల తూటాలు

శీతాకాలంలో సీమలో ఫ్యాక్షన్ రాజకీయాలు వేడెక్కాయి. ఎంపీ గోరంట్ల మాధవ్, పరిటాల రవి తనయుడు శ్రీరామ్ మధ్య మాటల యుద్దం జరుగుతోంది.

సీమలో హీటెక్కిన రాజకీయం : గోరంట్ల వెర్సస్ శ్రీరామ్..ఇద్దరి మధ్య పేలుతోన్న మాటల తూటాలు
Follow us

|

Updated on: Dec 10, 2020 | 9:09 PM

శీతాకాలంలో సీమలో ఫ్యాక్షన్ రాజకీయాలు వేడెక్కాయి. ఎంపీ గోరంట్ల మాధవ్, పరిటాల రవి తనయుడు శ్రీరామ్ మధ్య మాటల యుద్దం జరుగుతోంది. ఈ నేతల కామెంట్స్ కేవలం సీమలోనే కాదు..యావత్ ఏపీ రాష్ట్రంలోనూ ఇప్పుడు సెగలు రేపుతున్నాయి. అప్పట్లో  సీమలో పొలాలకు నీరు లేక, నెర్రలు కొట్టి..పైరు చస్తుంటే..పరిటాల రవి నక్సలిజం, ఫ్యాక్షనిజం పేరుతో ప్రజల తలలు నరికి రక్తపుటేర్లు పారించాడని గోరంట్ల మాధవ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. గోరంట్ల కామెంట్స్‌కు అదే రేంజ్‌లో కౌంటరిచ్చారు పరిటాల రవీంద్ర తనయుడు శ్రీరామ్.  ‘నీ మీద ఉన్న రేప్, మర్డర్ కేసులు ఫస్ట్ చూసులో.. తర్వాత మా గురించి మాట్లాడు’ అంటూ విమర్శలు గుప్పించారు. ‘మేము గల్లీ ఫ్యాక్షన్ అయితే, నీవు ఢిల్లీ స్థాయిలో రేపిస్ట్ అయ్యావు’ అంటూ తన మాటల్లో సీమ కారాన్ని జొప్పించారు.

అనంతపురంలో తాజాగా వర్చవల్ పద్దతిలో రిజర్వాయర్లకు శంకుస్థాపన చేశారు. జగన్ ప్రభుత్వం జిల్లాకు ఏం చేస్తుందో చెప్పే క్రమంలో..గతంలో సీమలో పరిస్థితుల గురించి చెబుతూ పరిటాల రవిపై కామెంట్స్ చేశారు ఎంపీ గోరంట్ల మాధవ్. తన తండ్రిని అన్ని మాటలంటే పరిటాల శ్రీరామ్ ఊరుకుంటారా…అదే రేంజ్‌లో కౌంటరిచ్చారు. ఇప్పుడు వాళ్ల టైమ్ నడుస్తుంది..భవిష్యత్‌లో తమ టైమ్ కూడా వస్తుందని హెచ్చరికలు జారీ చేశారు. పరిటాల రవి గారు హయాంలో నువ్వు ఎస్‌ఐగా ఉండి ఏం చేశావంటూ గోరంట్లను ప్రశ్నించారు శ్రీరామ్. ఖద్దరు చొక్కా వేస్తే సరిపోదు..కాస్త విలువలు పాటించాలని సూచించారు. టీడీపీ ప్రభుత్వం గతంలో చేసిన పనులను తామేదో చేసినట్లు చూపుతున్నారని, కొత్త పనులకు ప్రభుత్వం టెండర్లు ఎందుకు పిలవడం లేదో దమ్ముంటే చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. పుట్టకనుమ ప్రాజెక్టును ఆపి కొత్తవి చేయడం సరికాదన్నారు. ఏది ఏమైనా పరిటాల శ్రీరామ్, గోరంట్ల మాధవ్ మధ్య ప్రస్తుత మాటల యుద్దం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

Also Read : 

హైదరాబాద్‌లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు పున:ప్రారంభం, తాగి వాహనం నడిపితే బ్యాండ్ బాజానే

కారులో ఉంచి దర్శనానికి.. ఊపిరాడక చిన్నారులు ఉక్కిరిబిక్కిరి, ఇంతలో హోంగార్డు ఏం చేశాడంటే..?

16 మంది అమ్మాయిలతో బిగ్ బాస్ ఇంట్లోకి వెళ్తా, కెమెరాలు ఉన్నా ఫర్వాలేదు : వర్మ మార్క్ కామెంట్స్