సఫారీలతో ఓటమి.. టీ20 వరల్డ్‌కప్ లక్ష్యంగా కోహ్లీ డేరింగ్ డెషిషన్?

దక్షిణాఫ్రికాతో ఆదివారం జరిగిన చివరి టీ20 మ్యాచ్ టీమిండియా పేలవమైన ఆటతీరుతో ఓటమిపాలైన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో కెప్టెన్ విరాట్ కోహ్లీ తీసుకున్న తప్పుడు నిర్ణయమే మ్యాచ్ ఓడిపోవడానికి కారణమైందని నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా తీవ్ర విమర్శలు చేస్తున్నారు. బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో కోహ్లీ టాస్ గెలిచాడు. ఇక అందరిని ఆశ్చర్యపరుస్తూ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. వాస్తవానికి ఆదివారం ఉదయం, శనివారం రాత్రి బెంగళూరులో వర్షం నమోదైంది. దీంతో.. పిచ్‌పై […]

  • Ravi Kiran
  • Publish Date - 12:14 pm, Mon, 23 September 19
సఫారీలతో ఓటమి.. టీ20 వరల్డ్‌కప్ లక్ష్యంగా కోహ్లీ డేరింగ్ డెషిషన్?

దక్షిణాఫ్రికాతో ఆదివారం జరిగిన చివరి టీ20 మ్యాచ్ టీమిండియా పేలవమైన ఆటతీరుతో ఓటమిపాలైన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో కెప్టెన్ విరాట్ కోహ్లీ తీసుకున్న తప్పుడు నిర్ణయమే మ్యాచ్ ఓడిపోవడానికి కారణమైందని నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా తీవ్ర విమర్శలు చేస్తున్నారు. బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో కోహ్లీ టాస్ గెలిచాడు. ఇక అందరిని ఆశ్చర్యపరుస్తూ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. వాస్తవానికి ఆదివారం ఉదయం, శనివారం రాత్రి బెంగళూరులో వర్షం నమోదైంది. దీంతో.. పిచ్‌పై ఉన్న తేమ కారణంగా.. బ్యాటింగ్ చేయడం కొంచెం కష్టంగా ఉంటుంది. ఎంత హార్డ్ హిట్టింగ్‌కు ప్రయత్నించినా.. బంతి నెమ్మదిగా ఆగి బ్యాట్‌పైకి రావడంతో షాట్స్‌ను బ్యాట్స్‌మెన్స్ సరిగ్గా కనెక్ట్ చేయలేరు. ఈ విషయం తెలిసినా విరాట్ కోహ్లీ.. సాహసోపేతంగా తొలుత బ్యాటింగ్‌కే మొగ్గు చూపాడు.

ఇక పిచ్‌ను సద్వినియోగం చేసుకున్న దక్షిణాఫ్రికా బౌలర్లు చెలరేగిపోయారు. దీంతో భారత ఓపెనర్ శిఖర్ ధావన్(36) మినహా మిగిలిన బ్యాట్స్‌మెన్ ఎవరూ చెప్పుకోదగ్గ స్కోర్ చేయలేకపోయారు. ఈ స్టేడియంలో అద్భుతమైన రికార్డు ఉన్న విరాట్ కోహ్లీ సైతం తక్కువ పరుగులకే పెవిలియన్ చేరడం గమనార్హం. తొలి ఇన్నింగ్స్ ముగిసేసరికి భారత్ 20 ఓవర్లకు 134/9కి పరిమితమవగా.. లక్ష్యాన్ని మరో 19 బంతులు మిగిలి ఉండగానే దక్షిణాఫ్రికా ఛేదించింది. దీనితో మూడు టీ20ల సిరీస్ 1-1తో సమం చేసింది.

ఇది ఇలా ఉండగా కోహ్లీ మ్యాచ్ అనంతరం మీడియాతో మాట్లాడుతూ టీమ్‌పై ఒత్తిడి తేవాలనే ఉద్దేశంతోనే తాను ఫస్ట్ బ్యాటింగ్ ఎంచుకున్నట్లు చెప్పుకొచ్చాడు. ఇక ఈ నిర్ణయంపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. అయితే విరాట్ కోహ్లీ తీసుకున్న ఈ డెసిషన్ ఇప్పుడున్న పరిస్థితులలో తప్పుగా కనిపించి ఉండవచ్చు గానీ.. ఇలా డేరింగ్ నిర్ణయం తీసుకోవడం సరైనదని మాజీలు అభిప్రాయపడుతున్నారు.

బ్యాటింగ్ భారం మొత్తం శిఖర్ ధావన్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలపై పడుతుంటే.. బౌలింగ్ భారాన్ని బుమ్రా, భువీ, షమీ, కుల్దీప్, చాహల్‌లు మోస్తున్నారు. అంతేకాకుండా మిడిల్ ఆర్డర్ సమస్య ఎప్పటి నుంచో టీమిండియాకు వెంటాడుతున్న సమస్య. వీటిన్నంటిని అధిగమించాలంటే కెప్టెన్ సాహసోపేతమైన నిర్ణయం తీసుకోక తప్పదు. వాస్తవానికి ఇప్పుడు ఉన్న టీ20 టీమ్‌లో సీనియర్లు లేరు. అందరూ కూడా యువ బౌలర్లే. ఇలాంటి తరుణంలో ప్రయోగాలు చేస్తే.. వారు కుంగుబాటుకు లోనయ్యే ప్రమాదం ఉందని నెటిజన్లు భావిస్తున్నారు. కానీ ఈ తరుణంలో ఇలాంటి నిర్ణయం తీసుకుంటేనే వచ్చే ఏడాది ఆస్ట్రేలియాలో జరగనున్న టీ20 వరల్డ్‌కప్‌కు టీమ్‌ను సన్నద్ధం చేసే అవకాశం ఉంటుందని క్రీడా విశ్లేషకులు అంటున్నారు.