Pakistan Spy: భారత విదేశాంగశాఖలో పాక్ ఐఎస్‌ఐ ఏజెంట్ అరెస్ట్.!
మాస్కోలోని భారత దౌత్య కార్యాలయంలో పాకిస్తాన్ గూఢచర్యానికి పాల్పడింది. ఏకంగా అక్కడ తన గూఢచారిని నియమించుకుంది. భారత్ రష్యా వ్యూహాత్మక సంబంధాలపై నిఘా పెట్టింది. . తాజాగా అతడిని యూపీ యాంటీ టెర్రరిజం స్క్వాడ్... మేరఠ్‌లో అదుపులోకి తీసుకుంది. నిందితుడిని సతేందర్ సివాల్‌గా గుర్తించింది. అతడు విదేశాంగ శాఖలో మల్టీ టాస్కింగ్ స్టాఫ్‌గా పనిచేస్తున్నాడు.
మాస్కోలోని భారత దౌత్య కార్యాలయంలో పాకిస్తాన్ గూఢచర్యానికి పాల్పడింది. ఏకంగా అక్కడ తన గూఢచారిని నియమించుకుంది. భారత్ రష్యా వ్యూహాత్మక సంబంధాలపై నిఘా పెట్టింది. . తాజాగా అతడిని యూపీ యాంటీ టెర్రరిజం స్క్వాడ్… మేరఠ్‌లో అదుపులోకి తీసుకుంది. నిందితుడిని సతేందర్ సివాల్‌గా గుర్తించింది. అతడు విదేశాంగ శాఖలో మల్టీ టాస్కింగ్ స్టాఫ్‌గా పనిచేస్తున్నాడు. భారత విదేశాంగ శాఖలో ఒక ఐఎస్‌ఐ ఏజెంట్ చొరబడ్డాడని రహస్య సమాచారం అందడంతో ఏటీఎస్ అప్రమత్తమైంది. అతడు భారత సైన్యానికి సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని పాక్ నిఘా సంస్థకు అందజేస్తున్నాడని.. ప్రతిగా డబ్బు తీసుకొంటున్నట్లు పసిగట్టింది. ఈ సమాచారం భారత్‌కు భారీ ముప్పుగా పరిణమించే ప్రమాదం ఉందని అధికారులు పేర్కొన్నారు. సతేందర్‌ది హాపూర్ జిల్లా షమహిద్దుయూన్‌పుర్‌గా గుర్తించారు. అతడు మాస్కోలోని కార్యాలయంలో 2021 నుంచి ఇండియా బేస్డ్ సెక్యూరిటీ అసిస్టెంట్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు.
పాక్ గూఢచర్య నెట్‌వర్క్‌లో అతడు కీలక వ్యక్తని అధికారులు చెబుతున్నారు. తన హోదాను అడ్డం పెట్టుకుని అతడు ముఖ్య పత్రాలను సంపాదించాడు. వీటిల్లో రక్షణ, విదేశాంగ శాఖ నిర్ణయాలు, సైన్యం రోజువారీ కదలికలు వంటి వివరాలున్నాయి. అతడు కొందరు భారత అధికారులకు లంచాలు కూడా ఆశ చూపాడు. ఈ సమాచారాన్ని పాక్‌లోని ఐఎస్‌ఐ ప్రతినిధులకు చేర్చాడు. అతడి కదలికలపై నిఘా పెట్టిన తర్వాతే ఏటీఎస్ అధికారులు మేరఠ్‌లో విచారణకు పిలిపించారు. అడిగిన ప్రశ్నలకు అతడు సరైన సమాధానాలు ఇవ్వలేదు. చివరికి తాను పాక్‌కు గూఢచర్యం చేస్తున్నట్లు అంగీకరించాడు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్ మనీ తెలిస్తే షాకవుతారు..!
Mahesh Babu: హాలీవుడ్ గడ్డపై మహేష్ దిమ్మతరిగే రికార్డ్.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.
Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..