అమెరికా పైలట్ రెస్క్యూ నాటకమా ?? “యురేనియం” కోసమే అన్న ఇరాన్
అమెరికా ఇరాన్‌లో చేపట్టిన భారీ పైలట్ రెస్క్యూ ఆపరేషన్, దాని చుట్టూ అలుముకున్న రహస్యాలు. ట్రంప్ 155 విమానాలతో సైన్యం సాహసోపేతంగా పైలట్‌ను రక్షించిందని ప్రకటించారు. అయితే, ఇరాన్ దీనిని యురేనియం దొంగిలించే పథకం అని ఆరోపించింది. అదనంగా, అమెరికా తన అత్యంత కీలకమైన విమానాన్ని శత్రువుల చేతికి చిక్కకూడదనే ఉద్దేశంతో ధ్వంసం చేసింది. ఈ ఆపరేషన్ వివరాలు లీక్ చేసిన తమ ప్రభుత్వంలోని గూఢచారిపై ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
తన పైలట్ కోసం ఇరాన్‌లో భారీ రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించింది అమెరికా. ఒక్కడిని రక్షించడానికి విమానాల దండు నేవీ సీల్స్ కదిలొచ్చాయి. 155 విమానాలు ఆపరేషన్‌లో పాల్గొన్నట్లు అధ్యక్షుడు ట్రంప్ తెలిపారు. సాహసోపేత ఆపరేషన్‌ను తమ సైన్యం పూర్తి చేసిందని ట్రంప్ అన్నారు. పైలట్ అమెరికా బలగాల అధీనంలోనే సురక్షితంగా ఉన్నట్లు తెలిపారు. ఇరాన్‌లోని ప్రమాదకర పర్వతాల్లో అతడిని గుర్తించామని ఒక వైపు శత్రువులు అతడి కోసం వేట సాగిస్తుంటే.. మరోవైపు అతడి లొకేషన్‌ను 24 గంటలూ గమనిస్తూనే ఉన్నారని ట్రంప్ తెలిపారు. అయితే, ఇందుకు వేరే కారణం ఉందని ఇరాన్ చెబుతోంది. పైలట్ రెస్క్యూ కేవలం సాకు మాత్రమే అని, దీనికి వెనక ‘‘యురేనియం’’ దొంగిలించే ప్లాన్ ఉందని ఇరాన్ ఆరోపిస్తోంది. ఈ మొత్తం ఆపరేషన్ విజయాన్ని తక్కువగా చేసేందుకు ఇరాన్ ప్రయత్నించింది. ఇరాన్ విదేశాంగ ప్రతినిధి బఖాయీ మాట్లాడుతూ.. అది నిజమైన రెస్క్యూ ఆపరేషన్ కాకపోవచ్చని, అది ‘‘ఎన్ రిచ్డ్ యురేనియం’’ దొంగిలించడానికి ఒక మోసపూరిత ఆపరేషన్ అన్నారు. ఈ మిషన్ చుట్టూ చాలా అనుమానాలు ఉన్నాయని అమెరికన్ బలగాలు Isfahan లో దిగేందుకు ప్రయత్నించాయని, పైలట్ ఉన్న ప్రాంతానికి అది చాలా దూరమని ఆరోపించారు. ప్రస్తుతం ఇరాన్ వద్ద 400 కిలోల ఎన్‌రిచ్డ్ యురేనియం ఉంది. ఈ పరిమాణం అణ్వాయుధాలు తయరీకి సరిపోతుందనీ , ఇరాన్‌లోని యురేనియాన్ని స్వాధీనం చేసుకోవడానికి ట్రంప్ భూతల దాడులకు ప్లాన్ చేస్తున్నట్లు గతంలో అమెరికన్ మీడియా బయటపెట్టింది. ఇరాన్ భూభాగంలో తమకు చెందిన అత్యాధునిక విమానాన్ని అమెరికా స్వయంగా బాంబులతో పేల్చివేసింది. 100 మిలియన్ డాలర్ల విమానాన్ని శత్రుదేశానికి చిక్కకూడదనే ఏకైక కారణంతో ధ్వంసం చేసింది. ఆ విమానంలో అత్యంత కీలకమైన సెన్సార్లు, కమ్యూనికేషన్ వ్యవస్థలు, రహస్య యుద్ధ సాంకేతికత ఉన్నాయి. ఈ టెక్నాలజీ ఇరాన్ చేతికి చిక్కితే తమ సైనిక రహస్యాలు బయటపడతాయని అమెరికా భావించింది. ఆర్థికంగా భారీ నష్టమైనా భరించి, దేశ భద్రతకే ప్రాధాన్యత ఇవ్వాలని డిసైడ్ అయింది. కమాండోలు ఆ విమానాన్ని పేల్చేసి, పైలట్‌ను మరో విమానంలో తరలించారు. మాలోనే ఒక గూఢచారి ఉన్నాడని ట్రంప్ సంచలన కామెంట్ చేసారు. తమ ప్రభుత్వంలో ఒక గూఢచారి ఉన్నారని ఇరాన్‌లో కూలిపోయిన ఎఫ్-15 పైలట్‌ను కాపాడేందుకు యూఎస్ సైన్యం చేపట్టిన ఆపరేషన్ వివరాలను గుర్తుతెలియని వ్యక్తి లీక్ చేశారని ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఇరాన్ రైళ్ళపై దాడులకు ఇజ్రాయెల్ ప్లాన్
విశాఖలో మౌనిక హత్య కేసులో వెలుగులోకి కీలక అంశాలు
వీళ్లు మామూలు దొంగలు కాదు.. 12 నిమిషాల్లో.. కేజీ బంగారాన్ని కొట్టేశారు
Allu Arjun: బన్నీ బర్త్‌డే హంగామా..ఇంటి ముందు వేలాది మంది అభిమానులు..
