ట్రంప్‌ గోల్డెన్‌ డోమ్‌తో ప్రపంచ రక్షణ వ్యవస్థే మారబోతుందా?వీడియో

Updated on: May 24, 2025 | 7:25 PM

ప్రపంచం ఇప్పుడు యుద్ధ కుంపటిపై ఉంది. ఎప్పుడు ఏ దేశంతో యుద్ధం వస్తుందో తెలియని పరిస్థితి. మొన్నటి దాకా మధ్యప్రాచ్యం ప్రగిలిపోయింది. అంతకుముందు రష్యా, ఉక్రెయిన్ యుద్ధంతో వరల్డ్ వార్ త్రీ కన్ఫామ్ అన్న ఆందోళనలు పుట్టుకొచ్చాయి. ఇలా ఏ దిక్కున చూసినా వార్ సైరన్ మోగుతుంది. అందుకే అమెరికా ఓ రక్షణ కవచాన్ని సిద్ధం చేయాలని భావిస్తుంది. ఎలాంటి క్షిపణి దాడి జరిగినా దేశం సురక్షితంగా ఉండేలా ఓ బంగారు కవచాన్ని రెడీ చేస్తుంది. మామూలుగా అత్యంత శక్తివంతమైన ఆయుధ వ్యవస్థ ఏదని చెబితే తక్కువగా గుర్తుకొచ్చేది ఇజ్రాయిల్ ఐరన్ డోమ్.

ప్రత్యర్థుల క్షిపణులు ఎటునుంచి దూసుకు వచ్చినా ఉక్కు కవచంలా వాటిని అడ్డుకుంటుంది. అమెరికా సాయంతో 2011 నాటికి ఐరన్ డోమ్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది ఇజ్రాయిల్. ఇప్పుడు అంతకుమించిన రక్షణ వ్యవస్థను ప్లాన్ చేసింది అమెరికా. ఐరన్ డోమ్ కు నెక్స్ట్ లెవెల్ గోల్డెన్ డోమ్ ను అభివృద్ధి చేసేందుకు అమెరికా సైతం సిద్ధమైంది. ఇది దేశం నుంచి దేశం కాదు. అంతరిక్షం నుంచి ప్రయోగించిన అడ్డుకునేలా గోల్డెన్ డోమ్ ను రూపొందించబోతున్నామని ఆ దేశ అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు.మూడేళ్లలో గోల్డెన్ డోమ్ ను రెడీ చేస్తామని ట్రంప్ అమెరికా ప్రజలకు హామీ ఇచ్చాడు. గోల్డెన్ డోమ్ ప్రాజెక్టు కోసం మొత్తం 175 మిలియన్ డాలర్లు ఖర్చు పెడుతుంది. ఇందులో మొదటి విడతగా 25 మిలియన్ డాలర్లను కేటాయించింది. గోల్డెన్ డోమ్ బహుళక్షిపణి దాడులను నిరోధించే సామర్థ్యంతో తయారు కాబోతుంది.