క్యాన్సర్‌‌కు చెక్ పెట్టే రష్యన్ టీకా వీడియో

Updated on: Sep 09, 2025 | 1:59 PM

వైద్య ప్రపంచంలో రష్యా ఒక అద్భుత సంచలనానికి తెరలేపింది. క్యాన్సర్ వ్యాధికి చికిత్సగా ఎంటెరోమిక్స్ పేరుతో వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసింది. ఈ వ్యాక్సిన్‌ను ప్రయోగశాల స్థాయిలో పరీక్షించినప్పుడు ఇది 100 శాతం ప్రభావవంతంగా పనిచేసినట్లు తెలిసింది. ఈ శుభవార్త ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్యాన్సర్ రోగుల్లో కొత్త ఆశలను రేకెత్తిస్తోంది. గతంలో స్పుత్నిక్ కోవిడ్ వ్యాక్సిన్‌ను రూపొందించి ప్రపంచ దృష్టిని ఆకర్షించిన మాస్కోలోని ప్రముఖ సెంటర్ లోనే ఈ ఎంటెరోమిక్స్ వ్యాక్సిన్‌ను కూడా అభివృద్ధి చేశారు. ఇది ఒక రకమైన ఎంఆర్ఎన్ఏ ఆధారిత చికిత్సా విధానం.

ఈ వ్యాక్సిన్‌ను ఒక్కో రోగికి వారి కణితి కణాల జన్యువుల ఆధారంగా ప్రత్యేకంగా తయారుచేస్తారు. దీని ద్వారా వ్యాక్సిన్ నేరుగా క్యాన్సర్ కణాలను మాత్రమే లక్ష్యంగా చేసుకుని దాడి చేస్తుంది. ప్రస్తుతం ఈ వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ లోకి ప్రవేశించింది. ఈ ట్రయల్స్ విజయవంతమైతే ఇది క్యాన్సర్ చికిత్సారంగంలో ఒక నూతన అధ్యయాన్ని ప్రారంభిస్తుందని నిపుణులు భావిస్తున్నారు. ప్రాథమిక పరీక్షలో దీని ఫలితాలు ఆశాజనకంగా ఉండడంతో రష్యా ప్రభుత్వం ఈ వ్యాక్సిన్‌ను తమ పౌరులకు ఉచితంగా అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. క్యాన్సర్ చికిత్స కోసం అమెరికాకు చెందిన మోడర్నా కంపెనీ ఎంఆర్ఎన్ఏ ఆధారిత క్యాన్సర్ థెరపీలను అభివృద్ధి చేస్తోంది. అయితే రష్యా ఎంటెరోమిక్స్ వ్యాక్సిన్ తో ఈ పోటీలో ముందంజలో ఉన్నట్టు కనిపిస్తోంది. ఇది కేవలం ఒక వైద్య ఆవిష్కరణ మాత్రమే కాదని ప్రపంచ ఆరోగ్య వ్యవస్థపై ఘనమైన ప్రభావాన్ని చూపగల సామర్థ్యం దీనికి ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. క్యాన్సర్ వ్యాధితో పోరాడుతున్న లక్షలాది మందికి ఈ వ్యాక్సిన్ ఒక కొత్త ఆశను ఇస్తోంది. ఈ క్లినికల్ ట్రయల్స్ విజయం సాధించి వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తే ఇది క్యాన్సర్‌ను పూర్తిగా నయం చేయగలదని లేదా కనీసం దానిని దీర్ఘకాలిక వ్యాధిగా మార్చగలదని వైద్య నిపుణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం :

అంతరిక్షంలో ఇరుక్కుపోయా.. ఆక్సిజన్‌కి డబ్బులు పంపవా?వీడియో

వారికి జీతం 3 రెట్లు పెంపు.. ఒక్కొక్కరికీ నెలకు రూ.లక్షపైనే వీడియో

ప్రకాశ్ రాజ్ ఎమోషనల్ పోస్ట్.. డియర్ గౌరీ అంటూ.. వీడియో

పని వాళ్లకి రూ.80 లక్షల ఇల్లు గిఫ్ట్ వీడియో

Published on: Sep 09, 2025 12:08 PM
Loading...
Unable to load recommendations.
Follow Us