Pink Diamond: ఇది కదా జాక్ పాట్ అంటే..! రూ. 1000కోట్ల పింక్ డైమండ్ దొరికింది.! ఎక్కడో తెలుసా..?
ఆఫ్రికా ఖండంలోని అంగోలా ప్రపంచంలోనే అరుదైన పెద్ద పింక్ వజ్రం బయటపడింది. అంగోలాలో వజ్రాల కోసం తవ్వకాలు జరుపుతున్న సమయంలో ఈ డైమండ్ బయటపడింది.
ఆఫ్రికా ఖండంలోని అంగోలా ప్రపంచంలోనే అరుదైన పెద్ద పింక్ వజ్రం బయటపడింది. అంగోలాలో వజ్రాల కోసం తవ్వకాలు జరుపుతున్న సమయంలో ఈ డైమండ్ బయటపడింది. దీనిని ఆస్ట్రేలియాకు చెందిన లుపాకా అనే డైమండ్ కంపెనీ గుర్తించింది. ఈ వజ్రం అచ్చమైన లేత గులాబీ రంగులో ఏకంగా 170 క్యారెట్ల బరువు ఉందని తెలిపింది లుపాకా సంస్థ. ప్రపంచవ్యాప్తంగా గత 300 ఏళ్లలో గుర్తించిన అతిపెద్ద పింక్ డైమండ్ ఇదేనని భావిస్తున్నట్టు వెల్లడించింది. అయితే ఈ వజ్రానికి లులో రోజ్ అని పేరు పెట్టారు. ప్రస్తుతం ముడి రూపంలో ఈ వజ్రాన్ని సానబెడితే.. 85 నుంచి 90 క్యారెట్ల వరకు ఉండే ఒక పెద్ద పాలిష్డ్ వజ్రంగా రెడీ అవుతుంది తెలిపారు. అయితే వజ్రం ఖరీదు సుమారు.. 900 కోట్ల నుంచి వెయ్యి కోట్ల రూపాయల దాకా ఉండొచ్చని భావిస్తున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Python-cat: పిల్లిపై కొండచిలువ ఎటాక్.. సూపర్ షాకిచ్చిన పిల్లి.. వైరల్ అవుతున్న సూపర్ వీడియో..
Cats fight: నడిరోడ్డుపై పిల్లుల ముష్టి యుద్ధం.. మధ్యలో దూరిన కాకి ఏం చేసిందో చూస్తే నవ్వులే..
