Rishi Sunak: ఏటా 3వేల వీసాలు.. భారతీయులకు రిషి సునాక్ గుడ్‌న్యూస్‌..(Video)

|

Nov 17, 2022 | 9:24 AM

 బ్రిటన్‌ కీలక నిర్ణయం తీసుకుంది. భారత్‌కు గుడ్‌ న్యూస్‌ చెప్పింది. భారత యువ ప్రొఫెషనల్స్‌కు ఏటా 3వేల వీసాలు అందించేలా..సరికొత్త పథకానికి ఆమోదం తెలిపారు UK ప్రధాని రిషి సునాక్‌. ఇండోనేషియా బాలిలో జి-20 సదస్సు వేదికగా.. ప్రధాని మోదీతో భేటీ అయిన కొద్ది గంటలకే ఈ ప్రకటన వెలువడింది. భారతీయ మూలాలున్న రిషి సునాక్‌.. బ్రిటన్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మోదీతో భేటీ కావడం ఇదే తొలిసారి. ప్రస్తుతం బ్రిటన్, భారత్ మధ్య […]

బ్రిటన్‌ కీలక నిర్ణయం తీసుకుంది. భారత్‌కు గుడ్‌ న్యూస్‌ చెప్పింది. భారత యువ ప్రొఫెషనల్స్‌కు ఏటా 3వేల వీసాలు అందించేలా..సరికొత్త పథకానికి ఆమోదం తెలిపారు UK ప్రధాని రిషి సునాక్‌. ఇండోనేషియా బాలిలో జి-20 సదస్సు వేదికగా.. ప్రధాని మోదీతో భేటీ అయిన కొద్ది గంటలకే ఈ ప్రకటన వెలువడింది. భారతీయ మూలాలున్న రిషి సునాక్‌.. బ్రిటన్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మోదీతో భేటీ కావడం ఇదే తొలిసారి. ప్రస్తుతం బ్రిటన్, భారత్ మధ్య వ్యాపార ఒప్పందం కోసం చర్చలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి ఇది దోహదపడుతుందని తెలిపింది బ్రిటన్‌.

Published on: Nov 17, 2022 09:24 AM