World War III: మూడో ప్రపంచ యుద్ధానికి అడుగులు పడుతున్నాయా..? ఎవరిది రణం.. ఎవరిది శరణం..

|

Nov 21, 2024 | 8:53 AM

నా ఇగో దెబ్బతింది. నేను హర్ట్ అయ్యాను. అర్జంట్ గా యుద్ధం చేయాల్సిందే. అణ్వాయుధాలను సిద్ధం చేయండి. వార్ కు వెల్ కమ్ చెప్పండి. బెదిరించండి. భయపెట్టండి. దారికి రాకపోతే.. రణమా.. శరణమా అని తేల్చి చెప్పండి. ఈ మాటలన్నీ వింటే.. ఇవి దేని గురించో మీకు అర్థమై ఉంటుంది. రష్యా, ఉక్రెయిన్ యుద్ధం ఇప్పుడు అణ్వాయుధాల గడప వరకు వచ్చింది. న్యూక్లియర్ వార్ డోర్ ఓపెన్ చేయడానికి రష్యా ఊ కొట్టింది.

నా ఇగో దెబ్బతింది. నేను హర్ట్ అయ్యాను. అర్జంట్ గా యుద్ధం చేయాల్సిందే. అణ్వాయుధాలను సిద్ధం చేయండి. వార్ కు వెల్ కమ్ చెప్పండి. బెదిరించండి. భయపెట్టండి. దారికి రాకపోతే.. రణమా.. శరణమా అని తేల్చి చెప్పండి. ఈ మాటలన్నీ వింటే.. ఇవి దేని గురించో మీకు అర్థమై ఉంటుంది. రష్యా, ఉక్రెయిన్ యుద్ధం ఇప్పుడు అణ్వాయుధాల గడప వరకు వచ్చింది. న్యూక్లియర్ వార్ డోర్ ఓపెన్ చేయడానికి రష్యా ఊ కొట్టింది. ఇప్పుడు ఉక్రెయిన్ ఊహూ అనడానికి లేదు. బ్యాక్ బోన్ గా ఉన్న అమెరికాను చూసి తొడగొడతానంటే ఇకపై కుదరొచ్చు, కుదరకపోవచ్చు. ఎందుకంటే.. అక్కడ త్వరలో ప్రభుత్వం మారుతోంది. ట్రంప్ వచ్చాక కొత్త పాలసీలు తెస్తారు. సమరానికి సై అంటారో, శాంతికి జై కొడతారో తెలియదు. అది వచ్చే ఏడాదిలో జనవరి 20 తరువాత తేలుతుంది. ఇప్పటికైతే అమెరికా ప్రస్తుత అధ్యక్షుడు బైడెన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని అడుగు ముందుకు వేస్తే.. తరువాతి సీన్ ఎలా ఉంటుందో చెప్పలేం. ఎందుకంటే.. రష్యా దగ్గర అణ్వాయుధాలు తక్కువేం లేవు. వాటి న్యూక్లియర్ హెడ్స్ లెక్కే దీనికి సాక్ష్యం. రష్యా దగ్గర 5 వేల 500 న్యూక్లియర్ వార్ హెడ్స్ ఉన్నాయి.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇవి కూడా చదవండి..

భారత ప్రాచీన శాస్త్ర విజ్ఞానం.. మన రుషుల అద్భుత ఆవిష్కరణలు ఎన్నెన్నో..

వామ్మో.. దూసుకొస్తున్న మరో తుఫాన్ ముప్పు.. ఈ ప్రాంతాల్లో కుండపోత వర్షాలు.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదిగో..

Published on: Nov 21, 2024 08:43 AM