సిడ్నీ బీచ్‌లో వింత ఘటన.. బీచ్‌ మూసివేత..

|

Oct 21, 2024 | 8:37 PM

సముద్రతీర ప్రాంతాలు, బీచ్‌ల్లో వింతవింత జీవులు కనిపిస్తుంటాయి. సముద్రం అంటేనే ఎన్నో రకాల జీవులకు నిలయం. సముద్ర గర్భంలో ఎన్నో వింతలు కనిపిస్తాయి. వాటిపైన శాస్త్రవేత్తలు నిరంతరం పరిశోధనలు చేస్తూనే ఉంటారు. తాజాగా ఆస్ట్రేలియాలోని బీచ్‌లో కొన్ని వింత ఆకారాలు దర్శనమిచ్చాయి. నల్లగా బంతుల్లా ఉన్న వాటి కారణంగా ఏకంగా ఆ బీచ్‌నే మూసివేశారు అధికారులు.

ఆస్ట్రేలియాలోని సిడ్నీలో ఓ వింత ఘటన జరిగింది. సిడ్నీలోని రెండు ప్రసిద్ధి చెందిన బీచ్‌లలో నల్లని బంతులు కనిపించాయి. నిత్యం పర్యాటకులతో రద్దీగా ఉండే కూగీ బీచ్‌లో అనుమానాస్పదంగా నల్ల బంతులు కనిపించాయని స్థానిక మేయర్‌ డైలాన్‌ పార్కర్‌ పేర్కొన్నారు. ఇవి గోల్ఫ్‌ ఆడే బంతి సైజులో ఉన్నాయని తెలిపారు. ఈ బంతులు ఏంటి, ఎలా వచ్చాయి అనే విషయాలు తెలుసుకునే పనిలో పడ్డారు ఆస్ట్రేలియన్‌ అధికారులు. మరోవైపు గోర్డాన్స్‌ బే వద్ద కూడా ఇలాంటి నల్ల బంతులే కనిపించాయి. ఇది ఫిషింగ్‌కు ప్రసిద్ధి చెందిన ఆక్వాటిక్‌ రిజర్వ్‌. వింతైన బంతులు కనిపించడంతో ఆ రెండు బీచ్‌లను తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

CPR Training: హార్ట్ స్ట్రోక్ వస్తే పిల్లలకు..పెద్దలకు ఫస్ట్ ఎయిడ్ ఎలా చెయ్యాలి

సైన్యంలోకి కొత్తగా 14 లక్షల మంది.. ఉత్తర కొరియా ఏం చేస్తోంది

 

Published on: Oct 21, 2024 08:32 PM