గర్ల్‌ ఫ్రెండే.. దగ్గరుండి డ్రగ్స్‌ డాన్‌ను పట్టించింది

Updated on: Feb 26, 2026 | 6:34 PM

మెక్సికన్ డ్రగ్ డాన్ ఎల్ మెంచో ప్రియురాలి కదలికల ఆధారంగా మెక్సికన్ ప్రత్యేక దళాలు భారీ ఆపరేషన్ నిర్వహించాయి. అమెరికన్ నిఘా సమాచారంతో, ఈ ఆపరేషన్‌లో ఎల్ మెంచో తీవ్రంగా గాయపడి మరణించాడు. అతని మరణం దేశవ్యాప్తంగా తీవ్ర హింసకు దారితీసింది, వందలాది వాహనాలకు నిప్పు పెట్టారు. ప్రభుత్వం డ్రగ్స్ అక్రమ రవాణాపై రాజీలేని పోరాటాన్ని కొనసాగిస్తామని ప్రకటించింది.

డ్రగ్స్‌ డాన్‌ ‘ఎల్ మెంచో ను గర్ల్‌ఫ్రెండ్‌ కదలికలే పట్టించాయని మెక్సికన్ అధికారులు సోమవారం తెలిపారు. ఆధిపత్యం కోసం మరో గ్యాంగ్‌ ప్రయత్నించడంతో భారీ హింస చెలరేగింది. మెక్సికో అంతటా హై అలర్ట్ ప్రకటించారు. “ఎల్ మెన్చో”తో రాత్రి గడిపిన తర్వాత, ఆ మహిళను ట్రాక్‌ చేసి, ఆ ప్రాంతంలోనే డాన్‌ ఉన్నట్లు ధృవీకరించుకుని ప్రత్యేక దళాలు తమ ప్లాన్‌ ను అమలు చేశాయట. ఆపరేషన్ ఆదివారం తెల్లవారుజామున జరిగింది. ఎల్ మెంచో ప్రియురాలిపై నిఘా పెట్టిన మెక్సికన్ నిఘా వర్గాలు ఈ సారి విజయాన్ని సాధించాయి. అమెరికన్ ఇంటెలిజెన్స్ ఇచ్చిన పక్కా సమాచారంతో ఎల్ మెంచో అక్కడ ఉన్నాడని నిర్ధారించుకున్న మెక్సికన్ స్పెషల్ ఫోర్సెస్, ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టాయి. ఆరు హెలికాప్టర్లతో ఈ దాడిని నిర్వహించారు. ఎల్ మెంచో తప్పించుకోవడానికి ప్రయత్నించాడు అనుచరులు రాకెట్ లాంచర్లతో విరుచుకుపడ్డారు. ఒక పొదలో దాక్కున్న ఎల్ మెంచో కాల్పుల దాడిలో తీవ్రంగా గాయపడ్డాడు. ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మరణించాడు. మెక్సికన్ భద్రతా దళాలు నిర్వహించిన హై-స్టేక్స్ ఆపరేషన్‌ చారిత్రాత్మక విజయం తరువాత డ్రగ్స్ అక్రమ రవాణాపై రాజీలేని పోరాటం చేస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ ఆపరేషన్ తర్వాత చెలరేగిన హింసలో 70 మందికి పైగా మరణించారు జాలిస్కోలో ఎల్ మెంచో మరణ వార్తతో అతని అనుచరులు విధ్వంసానికి దిగారు వందలాది వాహనాలకు, పెట్రోల్ బంకులకు నిప్పు పెట్టారు. ప్రధాన నగరాల్లో భారీగా కాల్పులు, పేలుళ్లు జరగదంతో ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. ప్రజా రవాణా పూర్తిగా స్తంభించింది. పదేళ్లుగా న్యూ జనరేషన్ కార్టెల్‌ని నేర సామ్రాజ్యంగా విస్తరించాడు ఎల్‌ మెంచో. అతని సంపద ఒక బిలియన్ డాలర్లు అంటే రూ. 8,300 కోట్ల రూపాయల పై మాటేనని అమెరికా డ్రగ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అడ్మినిస్ట్రేషన్ అంచనా.వేసింది. ఎల్ మెన్చో భార్య సహా కుమారుడు, కుమార్తె, సోదరుడు సైతం ప్రస్తుతం ఊచలు లెక్కబెడుతున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.. కట్ చేస్తే తెల్లారే సరికి పోలీస్ స్టేషన్ లో

Vijay-Rashmika Marriage: విరోషి పెళ్లి వేడుకలో టాప్‌ 9 విశేషాలు..

ఏజెన్సీలో చీకటి వైద్యం.. సెల్‌ఫోన్‌ వెలుగుల్లో ప్రజల ప్రాణాలు

దారుణం.. 2 నెలల పసికందును పొయ్యిలో పడేసి..

Vijay-Rashmika Marriage: కొడవ సంప్రదాయంలో.. పెళ్లి చీర ఎలా కట్టుకుంటారంటే

Follow Us