Israel – Hamas: కాల్పుల విరమణకు హమాస్‌-ఇజ్రాయెల్‌ మధ్య కీలక ఒప్పందం ??

Updated on: Nov 19, 2023 | 9:04 PM

హమాస్‌ను మట్టుపెట్టడమే లక్ష్యంగా దాడులు చేస్తోంది ఇజ్రాయెల్‌. గాజాను పూర్తిగా చుట్టుముట్టిన ఇజ్రాయెల్‌ శరణార్ధ శిబిరాలను సైతం వదలడం లేదు. సొరంగాలు, ఆస్పత్రులు, కళాశాలలు, పాఠశాలలను మిలిటెంట్లు ఆయుధ బాండాగారాలుగా చేసుకున్నారంటూ పలు వీడియోలను విడుదల చేస్తున్నారు. మొదట ఉత్తరగాజాను లక్ష్యంగా చేసుకొని అక్కడి పౌరులను దక్షిణ గాజాకు వెళ్లాలని హెచ్చరించారు. బ్రతుకు జీవుడా అంటూ స్థానికులు దక్షిణగాజాకు వలసబాటపట్టారు.

హమాస్‌ను మట్టుపెట్టడమే లక్ష్యంగా దాడులు చేస్తోంది ఇజ్రాయెల్‌. గాజాను పూర్తిగా చుట్టుముట్టిన ఇజ్రాయెల్‌ శరణార్ధ శిబిరాలను సైతం వదలడం లేదు. సొరంగాలు, ఆస్పత్రులు, కళాశాలలు, పాఠశాలలను మిలిటెంట్లు ఆయుధ బాండాగారాలుగా చేసుకున్నారంటూ పలు వీడియోలను విడుదల చేస్తున్నారు. మొదట ఉత్తరగాజాను లక్ష్యంగా చేసుకొని అక్కడి పౌరులను దక్షిణ గాజాకు వెళ్లాలని హెచ్చరించారు. బ్రతుకు జీవుడా అంటూ స్థానికులు దక్షిణగాజాకు వలసబాటపట్టారు. కొందరు ఆరోగ్య శిబిరాల్లో తలదాచుకున్నారు. ఇప్పడు తాజాగా దక్షిణ గాజాను కూడా వదిలివెళ్లాలని హుకుం జారీ చేశారు. దాంతో మరోసారి దిక్కుతోచని స్థితిలో పౌరులు పశ్చిమ గాజాకు పరుగులు తీస్తున్నారు. ఆహారం, నీళ్లు, కరెంట్‌, మందులు సరఫరా నిలిపివేయడంతో ప్రజలు, ఆస్పత్రుల్లోని రోగులు నానా అవస్థలు పడుతున్నారు. చికిత్స అందక ఎందరో ప్రాణాలు కోల్పోతున్నారు. మరోవైపు గాజాలోని పాలస్తీనీయులకు మానవతా సాయం అందడంలేదు. దాంతో ఐక్యరాజ్యసమితి ఆకలి చావులు తప్పవని ఆందోళన వ్యక్తం చేసింది. మరోవైపు అమెరికా సహా కొన్ని దేశాలు కాల్పులు విరమించాలని ఇజ్రాయెల్‌కు సూచిస్తున్నాయి. అందుకు ఇజ్రాయెల్‌ ససేమిరా అంటోంది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

NTR Memorial Coin: రికార్డు స్థాయిలో ఎన్టీఆర్ స్మారక నాణెం అమ్మకాలు..

మిస్ యూనివర్స్‌ 2023 గా నికరాగ్వా భామ..షేనిస్

అందర్ని ఆకర్షించేలా బియ్యపుగింజపై వరల్డ్‌ కప్‌, జాతీయ జెండా

వినూత్నంగా అభిమానం చాటుకున్న స్వర్ణకారుడు !! బంగారంతో వరల్డ్‌కప్‌ స్డేడియం

బాలికల హాస్టల్‌లో నాగుపాము హల్‌చల్‌ !! భయంతో పరుగులు తీసిన విద్యార్ధులు

 

Loading...
Unable to load recommendations.
Follow Us