Gaza Tunnel: గాజాలోని ఐరాస కార్యాలయం కింద హమాస్ సొరంగం..: ఐరాస ఏజెన్సీ.

|

Feb 12, 2024 | 12:01 PM

గాజా సిటీలో పాలస్తీనా శరణార్థుల కోసం ఐక్యరాజ్యసమితి ఏజెన్సీ ఏర్పాటు చేసిన ప్రధాన కార్యాలయం కింద హమాస్ సొరంగాన్ని గుర్తించినట్టు ఇజ్రాయెల్ సైన్యం తాజాగా ప్రకటించింది. ఇజ్రాయెల్ సైన్యం, ఆ దేశ భద్రత ఏజెన్సీ ‘షిన్ బెట్’ ఇటీవల గాజా నగరంలో ఆపరేషన్స్ చేపడుతుండగా ఈ సొరంగం బయటపడింది. ఇది ఐక్యరాజ్యసమితి ఏజెన్సీ ఆఫీస్ భవనం కిందకు వెళ్తోంది.

గాజా సిటీలో పాలస్తీనా శరణార్థుల కోసం ఐక్యరాజ్యసమితి ఏజెన్సీ ఏర్పాటు చేసిన ప్రధాన కార్యాలయం కింద హమాస్ సొరంగాన్ని గుర్తించినట్టు ఇజ్రాయెల్ సైన్యం తాజాగా ప్రకటించింది. ఇజ్రాయెల్ సైన్యం, ఆ దేశ భద్రత ఏజెన్సీ ‘షిన్ బెట్’ ఇటీవల గాజా నగరంలో ఆపరేషన్స్ చేపడుతుండగా ఈ సొరంగం బయటపడింది. ఇది ఐక్యరాజ్యసమితి ఏజెన్సీ ఆఫీస్ భవనం కిందకు వెళ్తోంది. యూఎన్‌ఆర్‌డబ్ల్యూఏ నిర్వహించే పాఠశాల సమీపంలో సొరంగాన్ని కనుగొన్నామని ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. ఈ సొరంగం హమాస్ మిలిటరీ ఇంటెలిజెన్స్ విభాగానికి కీలకమైన స్థావరంగా ఉందని సొరంగంలో విద్యుత్ సదుపాయం ఉందని ఐక్యరాజ్యసమితి ఏజెన్సీ వసతుల ద్వారానే టన్నెల్‌కు విద్యుత్తును సరఫరా చేశారని ఇజ్రాయెల్ ఆర్మీ తెలిపింది. తమ కార్యకలాపాలపై అనుమానం రాకుండా, రక్షణ కవచంగా స్కూల్స్, హాస్పిటల్స్, జన సముదాయం అధికంగా ఉండే ప్రాంతాల కింద సొరంగాల నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసుకున్నారని గతంలోనే ఇజ్రాయెల్ ఆరోపించగా హమాస్ ఖండించించింది. ఇజ్రాయెల్ ప్రకటనపై ఐక్యరాజ్యసమితి ఏజెన్సీ స్పందించింది. దక్షిణ ఇజ్రాయెల్‌లో హమాస్ ఉగ్రవాదులు అక్టోబర్ 7 నుంచి భీకర దాడులు జరిపిన 5 రోజుల తర్వాత తమ కార్యకలాపాలను నిలిపివేశామని తెలిపింది. సొరంగం ఆరోపణలపై స్వతంత్ర దర్యాప్తుకు జరుగుతోందని తెలిపింది. మరోవైపు ఇజ్రాయెల్ ఆరోపణల నేపథ్యంలో గత నెలలో పలువురు సిబ్బందిని ఏజెన్సీ తొలగించింది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..

Follow us on