వాటర్ ప్లీజ్..! కాళ్ల బేరానికొచ్చిన పాక్

Updated on: Aug 14, 2025 | 1:45 PM

పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్, పాకిస్తాన్‌ల మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. పాక్‌కు బుద్ధి చెప్పడానికి భారత్ సింధు జలాలను నిలిపివేసింది. ఆ నిర్ణయంపై పాక్ ఎప్పటిలాగే.. బింకాలకు పోయింది. దెబ్బకు దెబ్బతీస్తామని, డ్యామ్‌లు పగలకొడతామని బెదిరించింది. అయితే.. 3 నెలలయ్యే సరికి ఆ దేశం దిగొచ్చింది. గత మూడు నెలలుగా నీటికష్టాలను అనుభవించిన పాక్‌.. ఇప్పుడు ‘వాటర్ ప్లీజ్’ అంటూ దీనాలాపాలు చేస్తోంది.

ఇటీవల పాక్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో, మిలిటరీ చీఫ్ అసిమ్ మునీర్ భారత్‌పై బెదిరింపులకు దిగారు. ‘అణు బాంబు వేసి సగం ప్రపంచాన్ని నాశనం చేస్తాం’ అంటూ అసిమ్ రెచ్చిపోయారు. సింధూ జలాలు ఇవ్వకపోతే అంబానీ ఆయిల్‌ రిఫైనరీపైనా.. న్యూక్లియర్ బాంబ్ వేస్తామని పాక్ సేనాధ్యక్షుడు బెదిరింపులకు దిగాడు. అయితే, సడన్‌గా వీరందరి వాయిస్ మారిపోయింది. సోమవారం ఓ కార్యక్రమంలో పాల్గొన్న భుట్లో.. భారత ప్రభుత్వ చర్యలతో.. పాక్‌ చాలా నష్టపోయిందని, ఈ పరిస్థితిలో ప్రజలంతా ఒక్కమాటపై ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. అయితే, పాక్‌ విదేశాంగ కార్యాలయం సోమవారం సింధు జలాల ఒప్పందం ప్రకారం.. గతంలో మాదిరిగా తమ వాటా నీటిని వదలాలంటూ.. భారత్ కు విజ్ఞప్తి చేసింది. ఓ వైపు అయ్యా..బాబూ అంటూనే మరోవైపు కుట్రలు, కుతంత్రాలకు దిగుతున్న పాక్.. ఎప్పటికపుడు భారత్‌ను టార్గెట్ చేసేందుకు ప్రయత్నిస్తూనే ఉంది. ఇటీవల.. నిరసన పేరుతో.. పాకిస్థాన్‌లోని భారత రాయబారుల ఇళ్లకు గ్యాస్‌, కరెంట్‌ సరఫరాను ఆపివేసింది. జూన్‌ నెలలో భారత హైకమిషన్‌, రాయబారుల ఇళ్లకు పత్రికలను నిలిపివేసింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఎట్టకేలకు అసలు బడ్జెట్‌ ఎంతో బయటపెట్టిన మహావతార్ నరసింహ డైరెక్టర్

మహేష్‌తో నటించేందుకు నో చెప్పిన.. మెగా హీరో

300 కోట్ల దిశగా.. మహావతార్‌ నరసింహ మూవీ

కొత్త షో స్టార్ట్ చేసిన జగపతి బాబు! రిబ్బన్ కట్‌ నాగార్జునతోనే…

విధి ఆడిన వింత నాటకంలో.. పాపం! చాలా కామెడీగా బలయ్యాడుగా..