భూకంపాన్ని జయించిన ‘ఆరేళ్ల బాలుడు’.. రెండు రోజుల తర్వాత..

|

Nov 29, 2022 | 9:32 AM

ఇండోనేషియాలో ఊహకందని విషాదం. భూకంప మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఇప్పటివరకు 271మంది మృతి చెందారు. వందలాది మంది తీవ్రగాయాలతో ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

ఇండోనేషియాలో ఊహకందని విషాదం. భూకంప మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఇప్పటివరకు 271మంది మృతి చెందారు. వందలాది మంది తీవ్రగాయాలతో ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వందలసంఖ్యలో భవనాలు దెబ్బతిన్నాయి. శిథిలాల కింద చిక్కుకున్నవారిని కాపాడేందుకు ఇంకా సహాయకచర్యలు కొనసాగుతున్నాయి. అయితే తాజాగా ఇండోనేసియా భూకంపాన్ని ఆరేళ్ల బాలుడు జయించాడు. సుమారు రెండు రోజుల పాటు శిథిలాల కింద చిక్కుకొని సురక్షితంగా బయటపట్టాడు. సియాంజూర్ నగరంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలోనే ఆరు సంవత్సరాల వయసున్న అజ్కా అనే బాలుడిని సహాయక సిబ్బంది జెస్కెన్ కొలిబు గుర్తించారు. అతడిని సురక్షితంగా బయటికి తీశారు. ఇళ్లు కుప్పకూలిన సమయంలో శిథిలాల కింద కాస్త గ్యాప్ ఏర్పడింది. ఆ చిన్న ప్లేస్‍లోనే అజ్కా ఉండిపోయాడు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

నదిలో కుప్పలుగా శిశువుల మృతదేహాలు !! పోలీసుల విచారణలో సంచలన విషయాలు

Follow us on