హెలికాప్టర్లతో లక్షలాది ‘మగ దోమల’ విడుదల.. కారణమేంటంటే ??

|

Jun 25, 2024 | 6:27 PM

అంతరించిపోతున్న జీవజాతులను పరిరక్షించుకునేందుకు అన్ని దేశాలు, స్థానిక ప్రభుత్వాలు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి. తమ ప్రాంతంలో కనుమరుగయ్యే ప్రమాదమున్న పలు రకాల అరుదైన పక్షులను కాపాడుకునేందుకు అమెరికాలోని హవాయి రాష్ట్రం బ్యాక్టీరియాతో కూడిన లక్షలాది ప్రత్యేక దోమలను విడిచిపెడుతోంది. హెలికాప్టర్ల సాయంతో ఇప్పటికే కోటి దోమలను వదిలినట్లు అంచనా. అందమైన హవాయి దీవుల్లో ఇటీవల 33 రకాల పక్షులు అంతరించిపోయినట్లు స్థానిక ప్రభుత్వం గుర్తించింది.

అంతరించిపోతున్న జీవజాతులను పరిరక్షించుకునేందుకు అన్ని దేశాలు, స్థానిక ప్రభుత్వాలు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి. తమ ప్రాంతంలో కనుమరుగయ్యే ప్రమాదమున్న పలు రకాల అరుదైన పక్షులను కాపాడుకునేందుకు అమెరికాలోని హవాయి రాష్ట్రం బ్యాక్టీరియాతో కూడిన లక్షలాది ప్రత్యేక దోమలను విడిచిపెడుతోంది. హెలికాప్టర్ల సాయంతో ఇప్పటికే కోటి దోమలను వదిలినట్లు అంచనా. అందమైన హవాయి దీవుల్లో ఇటీవల 33 రకాల పక్షులు అంతరించిపోయినట్లు స్థానిక ప్రభుత్వం గుర్తించింది. మరో 17 రకాలు ముప్పును ఎదుర్కొంటుండగా.. వీటిలో కొన్ని మరో ఏడాదిలోనే కనుమరుగయ్యే ప్రమాదం ఉంది. ఉదాహరణకు ‘అకికికి’ అనే పక్షుల సంఖ్య 2018లో 450 ఉన్నట్లు అంచనా వేయగా.. 2023 నాటికి వాటి సంఖ్య ఐదుకు పడిపోయింది. ఇప్పుడు ఒక్కటి మాత్రమే మిగిలి ఉండొచ్చని అంచనా. ఈ పరిణామంపై పర్యావరణవేత్తల నుంచి తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. అక్కడి ప్రభుత్వం ఇప్పటి వరకు కోటి దోమలను వివిధ ప్రదేశాల్లో విడిచిపెట్టినట్లు సమాచారం. హవాయిలో మాత్రమే కనిపించే కొన్ని అరుదైన హనీక్రీపర్స్‌ మలేరియా ముప్పును ఎదుర్కొంటున్నాయి. వ్యాధి కారక దోమ కుడితే 90 శాతం చనిపోయే ప్రమాదం ఉంది. మలేరియాను ఎదుర్కొనే రోగ నిరోధక శక్తి వీటికి లేకపోవడమే కారణం. దీనికి పరిష్కారంగా వోల్బాకియా అనే బ్యాక్టీరియాతో కూడిన మగ దోమలను ఉత్పత్తి చేస్తున్నారు. వీటిని కలిసిన ఆడ దోమలు గుడ్లు పొదగవు. ఇలా క్రమంగా దోమల సంఖ్యను తగ్గించే ఉద్దేశంతో ఈ సరికొత్త వ్యూహాన్ని అమలు చేస్తున్నారు. దీన్ని ఇన్‌కంపాటబుల్‌ ఇన్‌సెక్ట్‌ టెక్నిక్‌గా వ్యవహరిస్తారు. యూఎస్‌ నేషనల్‌ పార్క్‌ సర్వీస్‌ సహాయంతో హవాయి రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టును చేపట్టింది. చైనా, మెక్సికోలో దోమల సంఖ్యను తగ్గించేందుకు ఇదే విధానాన్ని అనుసరించినట్లు నివేదికలు చెబుతున్నాయి.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

బాత్రూం నుంచి వింత శబ్దాలు.. ఏంటా అని చూసినవారికి షాక్‌

రూ.224 కోట్ల సంపద దానం చేసిన యువతి !! ఎందుకంటే??

లైంగిక దాడి, అక్రమ సంబంధాల కేసుల్లో అబార్షన్లకు ఓకే

తిండి నిద్ర మానేసి.. టెన్షన్‌తో చిక్కిపోయి.. జైల్లో స్టార్ హీరోకు దారుణ పరిస్థితి

జైల్లో వెక్కి వెక్కి ఏడుస్తున్న పవిత్ర.. హత్యకు ముందు తెలియదా మరి ??