Hamas – Israel: ఇజ్రాయెల్ దాడి సక్సెస్.. హమాస్ టాప్ కమాండర్ హతం.!
హమాస్-ఇజ్రాయెల్ యుద్ధం కొనసాగుతోంది. ఈ క్రమంలో గాజాపై ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో హమాస్‌కు గట్టి ఎదరుదెబ్బ తగిలింది. ఇజ్రాయెల్ దాడుల్లో హమాస్ టాప్ కమాండర్ మర్వాన్ ఇస్సా మృతిచెందాడు. ఈ విషయాన్ని అమెరికా నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ జేక్ సలివన్ ప్రకటించారు. హమాస్‌పై పోరులో ఇజ్రాయెల్ కీలక పురోగతి సాధించింది. మిలిటెంట్ల కీలక బెటాలియన్లపై దాడులు చేయడమే కాకుండా టాప్ కమాండర్లతో సహా వేలమంది ఫైటర్లను ఇజ్రాయెల్ హతమార్చింది.
హమాస్-ఇజ్రాయెల్ యుద్ధం కొనసాగుతోంది. ఈ క్రమంలో గాజాపై ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో హమాస్‌కు గట్టి ఎదరుదెబ్బ తగిలింది. ఇజ్రాయెల్ దాడుల్లో హమాస్ టాప్ కమాండర్ మర్వాన్ ఇస్సా మృతిచెందాడు. ఈ విషయాన్ని అమెరికా నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ జేక్ సలివన్ ప్రకటించారు. హమాస్‌పై పోరులో ఇజ్రాయెల్ కీలక పురోగతి సాధించింది. మిలిటెంట్ల కీలక బెటాలియన్లపై దాడులు చేయడమే కాకుండా టాప్ కమాండర్లతో సహా వేలమంది ఫైటర్లను ఇజ్రాయెల్ హతమార్చింది. గతవారం ఐడీఎఫ్ దాడుల్లో హమాస్ గ్రూప్ మూడో ర్యాంక్ కమాండర్ మార్వాన్ ఇస్సా మృతిచెందాడు. మిగతా టాప్ కమాండర్లు టన్నెల్స్‌లో దాక్కున్నారు అంటూ కామెంట్స్ చేశారు. గత కొన్ని నెలలుగా గాజాపై ఇజ్రాయెల్ జరుపుతున్న దాడుల్లో వేల సంఖ్యలో పౌరులు, హమాస్ నేతలు మృత్యువాడపడ్డారు. కాగా, సెంట్రల్ గాజాలోని ఒక భూగర్భ సొరంగంలో దాక్కున్న ఇస్సా లక్ష్యంగా మార్చి 11న దాడులు జరిగినట్టు ఇజ్రాయెల్ దళాలు పేర్కొన్నాయి. దీంతో, ఇస్సా మృతి ఇజ్రాయెల్‌కు అతిపెద్ద విజయంగా వారు భావిస్తున్నారు. అయితే, హమాస్ మిలిటరీ అధిపతి మహమ్మద్ దీఫ్ డిప్యూటీగా ఇస్సాను పేర్కొంటారు. మిలిటరీ కార్యకలాపాల్లో ఇస్సా చాలా చురుకుగా ఉండేవాడని, అక్టోబర్ 7 నాటి మారణకాండలో కీలకపాత్ర పోషించాడని ఇజ్రాయెల్ భావిస్తోంది. మరోవైపు.. ఈ దాడుల్లో మృతిచెందింది ఇస్సానా? కాదా? అనే వివరాలు తెలియాల్సి ఉందని ఐడీఎఫ్ అధికార ప్రతినిధి రేర్ అడ్మిరల్ డానియేల్ హగరీ పేర్కొన్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
రాధమ్మ మదిలో కృష్ణయ్య.. చూడముచ్చటైన జంట గా తారక రామ , ప్రణతి.
ఆ విషయంలో ఇప్పటికీ వరుణ్ తేజ్ పై కోపమే ఉంది.! చిరు కామెంట్స్.