ట్రంప్ వార్నింగ్.. దిగొచ్చిన ఉగ్రసంస్థ హమాస్ వీడియో

Updated on: Oct 05, 2025 | 4:37 PM

ట్రంప్ హెచ్చరికతో హమాస్ దిగివచ్చింది. 20 సూత్రాల శాంతి ప్రణాళికకు అంగీకరించింది. ఇజ్రాయెల్ బందీలందరినీ విడుదల చేయడంతో పాటు గాజా పాలనను స్వతంత్ర పాలస్తీనా సంస్థకు అప్పగించేందుకు సుముఖత వ్యక్తం చేసింది. అయితే కొన్ని అంశాలపై చర్చలు కోరుతూ, ఇజ్రాయెల్ గాజాపై బాంబు దాడులు ఆపాలని ట్రంప్ సూచించారు.

ట్రంప్ హెచ్చరికల నేపథ్యంలో ఉగ్ర సంస్థ హమాస్ కీలక నిర్ణయాలను ప్రకటించింది. ఇజ్రాయెల్-హమాస్ ల మధ్య శాంతి నెలకొల్పేందుకు ట్రంప్ ప్రతిపాదించిన 20 సూత్రాల ప్రణాళికకు హమాస్ అంగీకరించింది. ఈ ప్రణాళికలో భాగంగా తమ చెరలోని ఇజ్రాయెల్ బందీలందరినీ విడుదల చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు హమాస్ తెలిపింది. గాజా పరిపాలనను స్వతంత్ర పాలస్తీనా సంస్థకు అప్పగించేందుకు కూడా హమాస్ సుముఖత వ్యక్తం చేసింది.

మరిన్ని వీడియోల కోసం :

మధ్యప్రదేశ్‌ను వణికిస్తున్న కొత్త వైరస్‌ వీడియో

రోడ్డుమధ్యలో వింత ఆకారం..ఆందోళనలో స్థానికులు వీడియో

దసరా సర్‌ప్రైజ్ ఇచ్చిన సామ్.. ఆనందంలో ఫ్యాన్స్ వీడియో

ఒక్క షో కోసం ఎంతో కష్టపడ్డా.. కానీ ఇప్పుడు వీడియో