యుద్ధానికి ముగింపు ఎప్పుడు? ఇజ్రాయెల్ స్పోక్స్ పర్సన్ గై నిర్ సంచలన వ్యాఖ్యలు

Updated on: Feb 09, 2026 | 4:51 PM

ఇజ్రాయెల్ ప్రతినిధి గై నిర్, గాజాలో యుద్ధ విరమణ, మానవతా సహాయం గురించి వివరించారు. హమాస్ ఉగ్రవాదులను లక్ష్యంగా చేసుకుంటున్నామని, గాజాకు భారీగా సహాయం అందిస్తున్నామని తెలిపారు. ఇరాన్‌తో యుద్ధాన్ని కోరుకోవడం లేదని, కానీ సిద్ధంగా ఉన్నామని అన్నారు. భారత్‌తో సంబంధాలు బలోపేతం అవుతున్నాయని, ముఖ్యంగా వ్యవసాయం, సాంకేతికత రంగాల్లో సహకారం పెరుగుతోందని స్పష్టం చేశారు.

ఇజ్రాయెల్ ప్రతినిధి గై నిర్, టీవీ9కు ఇచ్చిన ఇంటర్వ్యూలో గాజా యుద్ధ విరమణ, హమాస్, మానవతా సహాయం, ఇరాన్‌తో ఉద్రిక్తతలు మరియు భారత్‌తో సంబంధాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. మొదటి దశ యుద్ధ విరమణ పూర్తయిందని, అన్ని బందీలు తిరిగి వచ్చారని, ఇప్పుడు హమాస్ ఆయుధాలను విడిచిపెట్టే రెండో దశ ప్రారంభించాలని ఇజ్రాయెల్ కోరుకుంటుందని ఆయన తెలిపారు. హమాస్ ఉగ్రవాదులు సీజ్‌ఫైర్‌ను ఉల్లంఘిస్తే, వారిని లక్ష్యంగా చేసుకుంటామని స్పష్టం చేశారు. గాజాలో ధ్వంసమైన నిర్మాణాలు, హమాస్ ఉగ్రవాదులు నివసించే లేదా బాంబులు అమర్చిన ప్రదేశాలని పేర్కొన్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Lamborghini Accident: కాన్పూర్ లో లాంబోర్గిని కారు బీభత్సం

మహారాష్ట్రలో చర్చనీయ అంశంగా మారిన రైతు తీరు

తునిలో ఎస్బీఐ ఏటీఎం చోరీకి విఫల యత్నం

KTR: కేసీఆర్ ను తిట్టుడు తప్ప రెండేళ్లలో రేవంత్ చేసిందేంటి

అంబటిపై బిగుస్తున్న ఉచ్చు! గుంటూరు కోర్టులో నేడు కీలక పరిణామాలు