Elon Musk: ఎలాన్ మస్క్ కు పదకొండో బిడ్డ
టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ మరోసారి తండ్రి అయ్యారు. న్యూరాలింక్ స్పెషల్ ప్రాజెక్ట్స్ హెడ్ అయిన షివాన్ జెలీస్‌కు మూడో సంతానం జన్మించిందని బ్లూమ్ బెర్గ్ పేర్కొంది. ఇప్పటికే ఈ జంటకు 2021లో కవలలు పుట్టిన సంగతి తెలిసిందే. మస్క్‌కు ఇప్పటి వరకు మొత్తం 11 మంది సంతానం ఉన్నారు. వీరిలో ఐదుగురు తొలి భార్య జస్టిన్ మస్క్‌కు జన్మించారు. మరో ముగ్గురు మ్యూజిషియన్ గ్రిమెస్‌కు, ఇంకో ముగ్గురు జెలీస్‌కు పుట్టారు.
టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ మరోసారి తండ్రి అయ్యారు. న్యూరాలింక్ స్పెషల్ ప్రాజెక్ట్స్ హెడ్ అయిన షివాన్ జెలీస్‌కు మూడో సంతానం జన్మించిందని బ్లూమ్ బెర్గ్ పేర్కొంది. ఇప్పటికే ఈ జంటకు 2021లో కవలలు పుట్టిన సంగతి తెలిసిందే. మస్క్‌కు ఇప్పటి వరకు మొత్తం 11 మంది సంతానం ఉన్నారు. వీరిలో ఐదుగురు తొలి భార్య జస్టిన్ మస్క్‌కు జన్మించారు. మరో ముగ్గురు మ్యూజిషియన్ గ్రిమెస్‌కు, ఇంకో ముగ్గురు జెలీస్‌కు పుట్టారు. 2021లో జెలీస్‌కు కవలలు జన్మించిన సమయంలో మస్క్ మాట్లాడుతూ ఎక్కువ మంది సంతానం లేకపోతే నాగరికత కుంగిపోతుందని.. తన మాటలు రాసిపెట్టుకోవాలని అన్నారు. తనతో పిల్లలను కనాలని మస్క్ ప్రోత్సహించాడని జెలీస్ తెలిపారు. మస్క్ తన వద్ద పనిచేస్తున్న ఉద్యోగినులతో సన్నిహిత సంబంధాలు పెట్టుకోవడం కొత్తకాదు. తనతో పిల్లలను కనాలని మస్క్ కోరినట్లు 2013లో స్పేస్ ఎక్స్ నుంచి ఉద్యోగం మానేసిన ఓ మహిళ తెలిపింది. అప్పట్లో వాల్‌స్ట్రీట్ జర్నల్ ఈ విషయాన్ని వెల్లడించింది. అంతేకాదు.. మరో ఇద్దరు ఉద్యోగినులతో ఆయనకు సంబంధాలున్నట్లు ఆరోపణలు వచ్చాయి.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఆకాశాన్నంటుతున్న కూరగాయల ధరలు.. బెండ కాయలు కేజీ రూ.650లు
Nagarjuna: చెప్పినట్టే తప్పు దిద్దుకున్న నాగార్జున.. ఫిదా అవుతున్న ఫ్యాన్స్
ఏపీలో డయేరియా.. డేంజర్ బెల్స్ .. చికెన్, మటన్ అమ్మకాలు బంద్
SS Rajamouli: ప్రౌడ్ మూమెంట్.. ఆస్కార్ అకాడమీలో భాగమైన జక్కన్న!