250 అడుగుల ఎత్తులో.. అతి పెద్ద ఆర్చ్‌ నిర్మాణానికి ట్రంప్‌ ప్లాన్

Updated on: Feb 05, 2026 | 4:21 PM

ట్రంప్ తన 'ట్రూత్ సోషల్'లో ఇండియా గేట్ ఫొటోను పోస్ట్ చేసి, అమెరికా స్వాతంత్ర్యం 250 ఏళ్లు పూర్తయ్యే సందర్భంగా వాషింగ్టన్ డీసీలో 250 అడుగుల ఎత్తైన 'ఇండిపెండెన్స్ ఆర్చ్' నిర్మించాలనే తన ప్రణాళికను వెల్లడించారు. ఈ భారీ విజయ ద్వారం వైట్ హౌస్, లింకన్ మెమోరియల్‌ కన్నా ఎత్తుగా ఉండి, పారిస్ ఆర్క్ డి ట్రయంఫ్ వంటి ప్రపంచ ప్రఖ్యాత కట్టడాలను మించిపోవాలని ఆయన ఆకాంక్షిస్తున్నారు. ప్రాజెక్ట్ ఇంకా అనుమతులు పొందలేదు.

అమెరికా అధ్యక్షుడు ట్రంప్, న్యూఢిల్లీలోని ఇండియా గేట్ ఫొటోను తన సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ‘ట్రూత్ సోషల్’లో పోస్ట్ చేశారు. భారత చారిత్రక కట్టడాన్ని ప్రశంసిస్తూనే, “మాది అందరికంటే గొప్పదిగా ఉంటుంది” అని తనదైన శైలిలో కామెంట్ ను జోడించారు. సోమవారం చేసిన ఈ పోస్ట్ వెనుక ఓ పెద్ద ప్రణాళిక ఉన్నట్లు స్పష్టమవుతోంది. అమెరికాకు స్వాతంత్ర్యం వచ్చి 250 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా వాషింగ్టన్ డీసీలో ఓ భారీ విజయ ద్వారం నిర్మించాలనేది ట్రంప్ ప్రతిపాదన. ‘ఇండిపెండెన్స్ ఆర్చ్’గా పిలుస్తున్న ఈ నిర్మాణంతో తన ప్రణాళికను మరోసారి ట్రంప్‌ తెరపైకి తెచ్చారు. “250 ఏళ్ల స్వాతంత్ర్యానికి గుర్తుగా 250 అడుగుల ఎత్తు” అనే నినాదంతో దీన్ని నిర్మించాలని ఆయన భావిస్తున్నారు. ఈ ఆర్చ్ పూర్తయితే, అమెరికా రాజధానిలోని వైట్ హౌస్, లింకన్ మెమోరియల్‌ కంటే ఎంతో ఎత్తుగా ఉంటుంది. ప్రపంచంలోని ప్రఖ్యాత కట్టడాలతో పోలుస్తూ, పారిస్‌లోని ఆర్క్ డి ట్రయంఫ్ , మెక్సికో సిటీలోని ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్చ్ కన్నా కూడా తన ఆర్చ్ పెద్దదిగా ఉండాలని ట్రంప్ అన్నారు. ఇండియా గేట్ ఎత్తు 138 అడుగులు. మొదటి ప్రపంచ యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన భారత సైనికుల స్మారకార్థం దీన్ని నిర్మించారు. అయితే ట్రంప్ ప్రతిపాదిస్తున్న ఈ భారీ ప్రాజెక్టుకు ఇంకా అనుమతులు లభించలేదని తెలుస్తోంది. ఈ ప్రతిష్ఠాత్మక నిర్మాణం కార్యరూపం దాల్చడానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఈ విచిత్ర జంతువును చూశారా ?? గుడ్లు పెట్టి.. పాలు ఇస్తుంది

రోజుకు రూ.21 వేల సంపాదన.. జస్ట్‌ అదే చేసిన ఇన్‌ఫ్లూయెన్సర్‌

నడిరోడ్డుపై షాకింగ్‌ సీన్.. ఆవు తో మందు బాబు చేసిన పనికి అందరికీ మైండ్ బ్లాక్

విద్యార్థులకు బిగ్ రిలీఫ్.. స్కూల్‌లోనే అంతా..

సైలెంట్ కిల్లర్స్‌గా ఇయర్‌ఫోన్స్.. అతిగా వాడితే వచ్చే సమస్యలు ఇవే