అమెరికా కళాశాలల నుంచి గ్రాడ్యుయేట్ అయిన విదేశీ విద్యార్థులకు నేరుగా గ్రీన్‌కార్డు ఇవ్వాలని మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించారు. కంపెనీలు విదేశాల నుంచి ప్రతిభావంతులను నియమించుకోవడంపై మీ ప్రణాళికలేంటని ఓ ఇంటర్వ్యూలో అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. ఎన్నికల ప్రచారంలో వలస విధానంపై తరచూ విరుచుకుపడే ఆయన నోటినుంచి ఇలాంటి వ్యాఖ్యలు రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. కాలేజీల నుంచి గ్రాడ్యుయేట్ కాగానే అమెరికాలో ఉండేందుకు వీలుగా డిప్లొమాతో పాటే నేరుగా గ్రీన్ కార్డ్ ఇవ్వాలని అనుకుంటున్నట్లు ట్రంప్ అన్నారు. అది రెండేళ్లు.. నాలుగేళ్లు.. ఇలా విద్యాభ్యాసం వ్యవధితో సంబంధం లేదనీ జూనియర్ కాలేజ్‌లకు కూడా దీన్ని వర్తింపజేయాలని భావిస్తున్నట్లు ట్రంప్ చెప్పారు. తాను అధికారంలోకి వచ్చిన తొలిరోజే దీనిపై దృష్టి సారిస్తానని వెల్లడించారు. కరోనా వైరస్ కారణంగానే గతంలో దీన్ని అమలు చేయలేకపోయానని సమర్థించుకున్నారు. వీసా సమస్యల కారణంగా భారత్, చైనా వంటి దేశాల నుంచి వస్తున్న చాలామంది అమెరికాలో ఉండలేకపోతున్నారని తెలిపారు. వారంతా సొంత దేశాలకు వెళ్లి వేలాది మందికి ఉపాధి కల్పిస్తున్నారని అన్నారు. రెండోసారి అధ్యక్ష పీఠం కోసం బరిలోకి దిగిన ట్రంప్ సాధారణంగా ప్రచార కార్యక్రమాల్లో విదేశీ వలస విధానంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తుంటారు. కానీ, అందుకు భిన్నంగా ఈసారి ఆయన చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. అక్రమ వలసదారులు దేశంలో నిరుద్యోగం, హింస, నేరాలు, వనరుల దోపిడీకి కారణమవుతున్నారని పలు సందర్భాల్లో తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తాను అధికారంలోకి వస్తే వారందరినీ తిప్పి పంపిస్తానని హామీ ఇచ్చారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
హెలికాప్టర్లతో లక్షలాది ‘మగ దోమల’ విడుదల.. కారణమేంటంటే ??
బాత్రూం నుంచి వింత శబ్దాలు.. ఏంటా అని చూసినవారికి షాక్
రూ.224 కోట్ల సంపద దానం చేసిన యువతి !! ఎందుకంటే??
లైంగిక దాడి, అక్రమ సంబంధాల కేసుల్లో అబార్షన్లకు ఓకే
తిండి నిద్ర మానేసి.. టెన్షన్‌తో చిక్కిపోయి.. జైల్లో స్టార్ హీరోకు దారుణ పరిస్థితి