Donald Trump: అమెరికా అధ్యక్ష రేసుపై డోనాల్డ్ ట్రంప్‌ కీలక నిర్ణయం(Video)

|

Nov 17, 2022 | 9:21 AM

 మరోసారి రాజకీయాల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు అమెరికా మాజీ అధ్యక్షులు డోనాల్డ్ ట్రంప్. ముందు నుంచి చెబుతున్నట్లు ట్రంప్ త‌న నిర్ణయాన్ని ప్రక‌టించారు.. 2024లో జ‌ర‌గ‌బోయే అమెరికా అధ్యక్ష రేసులో ఉన్నట్లు ట్రంప్ స్పష్టం చేశారు. అమెరికాను మ‌ళ్లీ గొప్ప స్థానంలో నిలిపేందుకు, వైభ‌వంగా నిలిపేందుకు దేశాధ్యక్ష ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌నున్నట్లు ట్రంప్ తెలిపారు. వైట్‌హౌజ్ కోసం ఎన్నిక‌ల్లో నిల‌వ‌నున్నట్లు అమెరికా ఎన్నిక‌ల సంఘం ముందు ట్రంప్ త‌న ప‌త్రాల‌ను స‌మ‌ర్పించిన‌ట్లు తెలుస్తోంది. గ్రాండ్ ఓల్డ్ […]

మరోసారి రాజకీయాల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు అమెరికా మాజీ అధ్యక్షులు డోనాల్డ్ ట్రంప్. ముందు నుంచి చెబుతున్నట్లు ట్రంప్ త‌న నిర్ణయాన్ని ప్రక‌టించారు.. 2024లో జ‌ర‌గ‌బోయే అమెరికా అధ్యక్ష రేసులో ఉన్నట్లు ట్రంప్ స్పష్టం చేశారు. అమెరికాను మ‌ళ్లీ గొప్ప స్థానంలో నిలిపేందుకు, వైభ‌వంగా నిలిపేందుకు దేశాధ్యక్ష ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌నున్నట్లు ట్రంప్ తెలిపారు. వైట్‌హౌజ్ కోసం ఎన్నిక‌ల్లో నిల‌వ‌నున్నట్లు అమెరికా ఎన్నిక‌ల సంఘం ముందు ట్రంప్ త‌న ప‌త్రాల‌ను స‌మ‌ర్పించిన‌ట్లు తెలుస్తోంది. గ్రాండ్ ఓల్డ్ పార్టీగా ప్రఖ్యాతిగాంచిన‌ రిప‌బ్లిన్ పార్టీకి చెందిన ట్రంప్ 2016లో అమెరికా అధ్యక్షుడిగా ఎన్నిక‌య్యారు. అయితే గ‌త ఎన్నిక‌ల్లో జో బైడెన్ చేతిలో ఆయ‌నకు పరాభవం తప్పలేదు. రిప‌బ్లిక‌న్ పార్టీలో ట్రంప్‌పై వ్యతిరేక‌త ఉన్నా.. 2024లో జ‌రిగే దేశాధ్యక్ష ఎన్నిక‌ల్లో రిప‌బ్లిక‌న్ అభ్యర్థిగా పోటీ చేయ‌డానికి సంసిద్ధత వ్యక్తం చేశారు. అభిమానుల ముందు ప్రసంగించ‌డం చాలా ఈజీగా ఉంద‌ని, ఇలాంటి ప్రేమ ఉంటే వ‌చ్చే ఎన్నిక‌ల్లోనూ తానే పోటీ చేయ‌నున్నట్లు ట్రంప్ తెలిపారు. దేశాన్ని ఛిద్రం చేస్తున్న రేడిక‌ల్ లెఫ్ట్ డెమోక్రాట్ల‌ను ఓడిద్దామ‌ని ఆయ‌న పిలుపునిచ్చారు.

Follow us on