ఆ దేశంలో 500 శాతం పెరిగిన పెట్రోల్‌ ధర.. ఎందుకంటే ??

|

Jan 12, 2024 | 9:43 PM

ఆ దేశం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. ద్రవ్యలోటును తగ్గించుకునేందుకు కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఈ క్రమంలోనే పెట్రోల్‌ ధరలను 500 శాతానికి పైగా పెంచింది అక్కడి ప్రభుత్వం. ప్రభుత్వ ప్రకటనతో దేశ ప్రజలు షాక్‌కు గురయ్యారు. కరీబియన్‌ దేశం క్యూబాలో ఫిబ్రవరి 1 నుంచి ఈ పెంపు అమల్లోకి రానుంది. ప్రస్తుతం అక్కడ లీటర్‌ పెట్రోల్‌ ధర 25 క్యూబన్‌ పెసోలుగా ఉండగా.. తాజా నిర్ణయంతో అది 132 పెసోలకు అంటే భారత కరెన్సీలో దాదాపు రూ.450కు చేరనుంది.

ఆ దేశం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. ద్రవ్యలోటును తగ్గించుకునేందుకు కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఈ క్రమంలోనే పెట్రోల్‌ ధరలను 500 శాతానికి పైగా పెంచింది అక్కడి ప్రభుత్వం. ప్రభుత్వ ప్రకటనతో దేశ ప్రజలు షాక్‌కు గురయ్యారు. కరీబియన్‌ దేశం క్యూబాలో ఫిబ్రవరి 1 నుంచి ఈ పెంపు అమల్లోకి రానుంది. ప్రస్తుతం అక్కడ లీటర్‌ పెట్రోల్‌ ధర 25 క్యూబన్‌ పెసోలుగా ఉండగా.. తాజా నిర్ణయంతో అది 132 పెసోలకు అంటే భారత కరెన్సీలో దాదాపు రూ.450కు చేరనుంది. రానున్న రోజుల్లో డీజిల్‌, ఇతర ఇంధన ధరలు కూడా పెరగనున్నాయని క్యూబా ఆర్థిక మంత్రి రెగ్యురో మరో బాంబు పేల్చారు. నివాస సముదాయాలకు విద్యుత్‌ ఛార్జీలను కూడా 25 శాతం పెంచుతున్నట్లు తెలిపారు. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి చమురు కొనుగోలు చేసేందుకు విదేశీ కరెన్సీని పెంచుకోవాలని యోచిస్తున్నట్లు ఆయన అన్నారు. ఇందుకోసం, కొన్ని పెట్రోల్‌ బంకుల్లో ఇంధనాన్ని అమెరికా డాలర్లతో మాత్రమే ప్రజలు కొనుగోలు చేసేలా నిర్ణయం తీసుకుంటున్నట్లు చెప్పారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

గదిలో దగ్గుమందు.. ఓవర్‌డోస్‌ ఇచ్చి చంపిందా ??

అయోధ్య రామయ్యకు భక్తితో బంగారు పాదుకలు..

ప్రాణం తీసిన బొగ్గుల కుంపటి.. గదిలోనే సమాధి

డేంజర్‌ బెల్స్‌ మోగిస్తున్న వాటర్‌ బాటిళ్లు !! 2.4 లక్షల ప్లాస్టిక్‌ రేణువులు

Follow us on