Titan sub: వారికి తాము చనిపోతామని ముందే తెలిసిపోయిందా.? విషాద ప్రయాణం..
2023 జూన్‌లో అట్లాంటిక్ సముద్రంలో టైటన్ జలాంతర్గామి మునిగిపోయిన ఘటనలో అందులో ప్రయాణిస్తున్నవారికి తాము చనిపోతామని కొద్దిసేపటిముందే తెలిసిపోయిందని దావాలో ఆరోపించారు. అసలు టైటన్ మినీ జలాంతర్గామికి గతంలో సమస్యలు ఎదుర్కొన్న రికార్డు ఉందని అటార్నీ అన్నారు. తాజాగా మృతుడు పాల్ హెన్రీ కుటుంబం 50 మిలియన్ డాలర్ల పరిహారం కోరుతూ న్యాయస్థానం తలుపుతట్టింది.

టైటాన్ ప్రయాణం మొదలుపెట్టిన తర్వాత 90 నిమిషాల్లో అది బాహ్య ఒత్తిడిని తట్టుకోలేని స్థితికి చేరింది. దీంతో అందులో ప్రయాణించేవారికి మరికొద్ది సేపట్లో తమ పరిస్థితి ఏమిటో అర్థమైపోయింది. ఇక సిబ్బందికి అయితే.. తమ మరణం ఖాయమని అర్థమైపోయింది. లోతుకు వెళ్లే కొద్దీ నీటి బరువు పెరిగి.. టైటాన్ కార్బన్ ఫైబర్ పగులుతున్న చప్పుళ్లు వారికి స్పష్టంగా వినిపించే అవకాశం ఉన్నట్లు తెలిపింది. దీంతోపాటు టైటాన్ కమ్యూనికేషన్, విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. సమస్య సరిచేయలేని స్థితికి చేరిన సమయంలో కూడా వారు సముద్రం అడుగుకు ప్రయాణిస్తూనే ఉన్నారు. చివరికి అది నీటి ఒత్తిడిని తట్టుకోలేక నలిగి ముక్కలైపోయింది. దీంతో పాటు అసలు టైటాన్‌లో వాడిన కొన్ని కీలక పరికరాల పనితీరును కూడా ఈ దావాలో తప్పుపట్టారు. ఫ్రాన్స్‌కు చెందిన పైలట్ పాల్ హెన్రీకి టైటాన్‌లోని లోపాలు చెప్పకుండా దాచి పెట్టారని ఆరోపించారు.
అసలేం జరిగిందంటే.. గతేడాది జూన్ 18న అట్లాంటిక్ మహాసముద్రంలో 111 ఏళ్ల కిందట మునిగిన టైటానిక్ నౌక శకలాలను చూసేందుకు వెళ్లిన ఓ మినీ జలాంతర్గామి ఆచూకీ గల్లంతైంది. ఇందులో ఫ్రాన్స్ సాహస యాత్రికుడు పాల్ హెన్రీ నార్గొలెట్, బ్రిటన్ వ్యక్తి హమీష్ హార్డింగ్, పాకిస్థాన్ బిలియనీర్ షాజాదా దావూద్, ఆయన కుమారుడు సులేమాన్, మరొకరు ఉన్నారు. టైటానిక్ ఓడ సమీపంలో 488 మీటర్ల దూరంలో ఈ శకలాలను గుర్తించినట్లు అమెరికా కోస్ట్ గార్డ్ పేర్కొంది. టైటాన్ యాత్రను నిర్వహించిన ఓషన్ గేట్ సంస్థ సీఈఓ కూడా ఈ ప్రమాదంలో మృతి చెందారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.