China: చైనాలో భారీ విద్యుత్‌ కోతలు ! స్మార్ట్‌ఫోన్‌ వెలుగులో భోజనాలు! వీడియో

|

Oct 05, 2021 | 9:51 AM

చైనాలో చాలా నగరాల్లో విద్యుత్‌ కోతలు అమలవుతున్నాయి. దీంతో ప్రజలు జనరేటర్ల మీదే ఆధారపడి కాలం వెళ్ళదీస్తున్నారు. ఇంధన వినియోగాన్ని తగ్గించుకోవాలనే లక్ష్యాలను చేరుకోవడానికి విద్యుత్‌ కోతలు అమలు చేశారని కొందరు ఆర్థిక వేత్తలు విశ్లేషిస్తున్నారు.

YouTube video player

చైనాలో చాలా నగరాల్లో విద్యుత్‌ కోతలు అమలవుతున్నాయి. దీంతో ప్రజలు జనరేటర్ల మీదే ఆధారపడి కాలం వెళ్ళదీస్తున్నారు. ఇంధన వినియోగాన్ని తగ్గించుకోవాలనే లక్ష్యాలను చేరుకోవడానికి విద్యుత్‌ కోతలు అమలు చేశారని కొందరు ఆర్థిక వేత్తలు విశ్లేషిస్తున్నారు. ఇటీవల కాలంలో బొగ్గు ధరలు ఆకాశాన్నంటడంతో డిమాండ్‌కి తగ్గ సప్లయ్‌ చేయలేమని విద్యుత్‌ కంపెనీలు చేతులెత్తేసాయి. చైనాలో కొన్ని ఫ్యాక్టరీల్లో ఉత్పత్తి నిలిపివేయాల్సిందిగా ఆదేశాలు జారీ అయ్యాయి. ఫలితంగా స్మార్ట్‌ఫోన్‌లు, ఇతర ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తుల ఎగుమతులపై ప్రభావం పడుతుందనే ఆందోళనలు మొదలయ్యాయి. ఇటీవల చైనాలో విద్యుత్‌ వినియోగం రెట్టింపు అయింది. దీంతో కర్బన ఉద్గారాలు అధిక స్థాయిలో వెలువడి వాతావరణ కాలుష్యం పెరిగిపోతోంది. ఐక్యరాజ్య సమితి పర్యావరణ సదస్సు అక్టోబర్‌ 12–13 తేదీల్లో చైనాలోని కన్మింగ్‌లో జరగనుంది. ఆతిథ్య దేశంగా ఉంటూ ఈ స్థాయిలో ఇంధనాన్ని వినియోగిస్తే అంతర్జాతీయంగా విమర్శలు వస్తాయి.

 

మరిన్ని ఇక్కడ చూడండి: Bhadradri Kothagudem : మహిళా రైతు పై ఫారెస్ట్ అధికారి దాడి.. వీడియో

Bhadrachalam: శ్రీరామా..! వీటిని కూడా వదలడం లేదయ్యా.. వీడియో