Blizzard in Canada: కెనడాను వణికిస్తోన్న భారీ మంచు తుఫాన్‌.! నాన్‌స్టాప్‌ గా మంచువర్షం.

|

Mar 25, 2024 | 9:25 AM

మంచు తుఫాన్‌తో కెనడా విలవిల్లాడుతోంది. ముసురు పట్టినట్టుగా నాన్‌స్టాప్‌గా మంచు వర్షం కురుస్తోంది. కెనడా మొత్తం మంచుతో నిండిపోయింది. ఇళ్లు, భవనాలు, రోడ్లు... ఇలా ఏది చూసినా.. ఎటుచూసినా కనుచూపు మేర మంచే కనిపిస్తోంది. భారీ మంచు తుఫాన్‌ కారణంగా రోడ్లపై దట్టంగా మంచు పేరుకుపోతోంది. రోడ్లపై మంచును ఎప్పటికప్పుడు తొలగిస్తున్నా క్షణాల్లోనే మళ్లీ మంచు కమ్మేస్తోంది. కుండపోత వాన కురిసినట్టుగా దంచికొడుతోంది మంచువర్షం.

మంచు తుఫాన్‌తో కెనడా విలవిల్లాడుతోంది. ముసురు పట్టినట్టుగా నాన్‌స్టాప్‌గా మంచు వర్షం కురుస్తోంది. కెనడా మొత్తం మంచుతో నిండిపోయింది. ఇళ్లు, భవనాలు, రోడ్లు… ఇలా ఏది చూసినా… ఎటుచూసినా కనుచూపు మేర మంచే కనిపిస్తోంది. భారీ మంచు తుఫాన్‌ కారణంగా రోడ్లపై దట్టంగా మంచు పేరుకుపోతోంది. రోడ్లపై మంచును ఎప్పటికప్పుడు తొలగిస్తున్నా క్షణాల్లోనే మళ్లీ మంచు కమ్మేస్తోంది. కుండపోత వాన కురిసినట్టుగా దంచికొడుతోంది మంచువర్షం. భారీ మంచు వర్షంలోనూ యథాతథంగా కొనసాగుతున్నాయ్‌ కార్యకలాపాలు. మంచు గుప్పిట్లోనే ఆఫీసులకు వెళ్తున్నారు కెనడా ప్రజలు. మంచు గడ్డలపై రయ్‌మని దూసుకుపోతున్నాయ్‌ కార్లు. ఒక్క టొరొంటో నగరంలోనే 20 సెంటీమీటర్లకు పైగా మంచు వర్షం కురిసింది. ప్రస్తుతం కెనడాలోని పలు నగరాల్లో మైనస్‌ 8 డిగ్రీస్‌ టెంపరేచర్స్‌ నమోదవుతున్నాయ్‌. దాంతో, గడ్డకట్టే చలితో గజగజ వణికిపోతున్నారు కెనడా ప్రజలు. ఒకవైపు మంచు తుఫాన్‌ను కెనడాను అతలాకుతలం చేస్తుంటే… మరోవైపు అక్కడి దృశ్యాలు మైమరిపిస్తున్నాయ్‌. శ్వేతవర్ణంతో అద్భుత లోకాన్ని తలపిస్తోంది. నేల మొత్తం తెల్లని పాన్పులా మారిపోతే… ఇళ్లన్నీ మంచుపర్వతాలను తలపిస్తున్నాయ్‌. కెనడాలో ఎటుచూసినా తెల్లతెల్లగా మెరిసిపోతూ ఆహ్లాదంగా కనిపిస్తున్నాయి.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

రాధమ్మ మదిలో కృష్ణయ్య.. చూడముచ్చటైన జంట గా తారక రామ , ప్రణతి.

ఆ విషయంలో ఇప్పటికీ వరుణ్ తేజ్ పై కోపమే ఉంది.! చిరు కామెంట్స్.

‘నా భర్త VDలా ఉండాలి.!’ నో కన్ఫూజన్‌ తెలిసిన కాంబినేషనేగా..